వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళపై మొదటి తిరుగుబాటు ఇతనిదే

అన్నాడిఎంకె పార్టీని తమ గుప్పిట్లోకి తీసుకొనేందుకు శశికళ కుటుంబం ప్రయత్నిస్తుండడాన్ని అన్నాడిఎంకె పార్టీ నాయకుడు మునుస్వామి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ మేరకు ఆయన శశికళకు వ్యతిరేకంగా గళమెత్తారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకె పార్టీ పగ్గాలను శశికళ చేపట్టడాన్ని వ్యతిరేకించింది అన్నాడిఎంకెలో తొలి వ్యక్తి మునుస్వామి.అయితే పార్టీ సీనియర్లంతా శశికళ వైపే ఉండడంతో మునుస్వామి విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు.

జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకె పార్టీని శశికళ కుటుంబసభ్యులు తమ గుప్పిట్టోకి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుండడాన్ని మునుస్వామి జీర్ణించుకోలేదు.కృష్ణగిరి జిల్లాకు చెందిన కెపి మునుస్వామి శశికళ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. శశికళ కుటుంబం వ్యవహరిస్తోన్న తీరును ఆయన బహిరంగంగానే విమర్శించారు. అయితే మునుస్వామి తిరుగుబాటు బావుటాను ఎగురవేయడాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
శశికళ వెంటే పార్టీ సీనియర్లంతా ఉన్నారు. దీంతో మునుస్వామి ఒంటరివాడయ్యాడు.

munuswamy first rebel person from within aiadmk against sasikala

అయితే ఆమె ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.పార్టీ యావత్తూ కూడ శశికళ వెంటే ఉన్నందున అంతగా మునుస్వామి విమర్శలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. అయితే పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కరుగా మునుస్వామి దారిలోనే పయనించారు.

ఎస్పీ షణ్మగనాథన్, వీహెచ్ పాండియన్, సాయిదై దురైస్వామి, పీవి షణ్ముగం, మధుసూధన్ తదితర నేతలు శశికళకు వ్యతిరేకంగా మాట్లాడారు. చివరకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మౌనాన్ని వీడారు.

శత్రువుకు శత్రువు మిత్రుడంటారు. అయితే శశికళ వర్గంలో ఉంటూనే ఆమె తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న నాయకులను తమ వైపుకు తిప్పుకొనేందుకుగాను పన్నీర్ సెల్వం వర్గం ప్రయత్నిస్తోంది. పన్నీర్ సెల్వం వర్గం వైపుకు వచ్చేందుకుగాను ప్రయత్నిస్తున్న ఎంఏల్ఏల పట్ల శశికళ నిఘాను ఏర్పాటు చేసింది.

English summary
munuswamy first rebel person from within aiadmk against sasikala, other leaders against shashikala after munuswamy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X