సాఫ్టువేర్ కంపెనీ యజమాని పైన హత్యాయత్నం
బెంగళూరు: సాఫ్టువేర్ సంస్థల యజమానిని హత్య చెయ్యడానికి ప్రయత్నించిన వ్యాపారవేత్తను బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కేరళలోని త్రిశూర్‌లో నివాసం ఉంటున్న మహమ్మద్ నిషాన్ అలియాస్ మహమ్మద్‌ను విచారణ చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మహమ్మద్ నిషాన్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, దుబాయ్‌తో సహ విదేశాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, జ్యువెలరి షాప్‌లు, సిగరెట్లు, బీడిల వ్యాపారాలు చేస్తున్నాడు. ఇతనికి బెంగళూరు, చెన్నై, త్రిశూర్, దుబాయ్ తదితర చోట్ల సోంత అపార్ట్ మెంట్లు ఉంటున్నాయి.
వ్యాపారం నిమిత్తం ఇతను పలు నగరాలలో సంచరిస్తుంటాడు. విలాసవంతమైన, ఖరీదైన కార్లు కొనుగోలు చెయ్యడం మహమ్మద్ నిషాన్ అలవాటు. మహమ్మద్ నిషాన్ ఖరీదైన కార్ల సైలెన్సర్లలో ఎక్కువ శబ్దం వచ్చే విధంగా తయారు చేసుకున్నాడు. అర్దరాత్రి ఇతను ఆ ఖరీదైన కార్లను రోడ్ల మీదకు తెచ్చి ఎక్కువ శుభ్రం చేస్తూ తిరుగుతుంటాడు.

ఇప్పటికే ఇతనికి బెంగళూరు పోలీసులు రెండు మూడుసార్లు అర్దరాత్రి రోడ్ల మీద న్యూసెన్స్ చెయ్యరాదని హెచ్చరించారు. అయితే అతని పద్దతి మారలేదు. 2014 డిసెంబర్ 22వ తేది అర్దరాత్రి బెంగళూరులోని యుబి సిటి సమీపంలోని మల్యా రోడ్డులో ఎక్కువ శబ్దం వచ్చేటట్లు కారు నడిపాడు. ఆ సమయంలో సాఫ్టువేర్ సంస్థల యజమాని సుమన్ కారును అడ్డుకుని.. న్యూసెన్స్ ఏమిటని నిలదీశాడు.
ఈ విషయంలో ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. ఆ సందర్బంలో సుమన్ మీద దాడి చెయ్యడంతో ఆయన రోడ్డు మీద పడిపోయాడు. తర్వాత నిషాన్ కారును సుమన్ మీదకు నడిపాడు. అదృష్టవశాత్తు సుమన్ పక్కకు దోర్లుకొవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సుమన్‌కు గాయాలు అయ్యాయి. సుమన్ ఫిర్యాదు చెయ్యడంతో కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న నిషాన్ కేరళ పరారైనాడు. త్రిశూర్ లో నిషాన్‌కు సోంత అపార్ట్‌మెంట్ ఉంది.
నిషాన్ అపార్ట్‌మెంట్ దగ్గర చంద్రబోస్ (50) అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. జనవరి 29వ తేదిన అర్దరాత్రి నిషాన్ కారులో అపార్ట్‌మెంట్ దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో చంద్రబోస్ గేట్ తియ్యడంలో ఆలస్యం చేశాడు. ఆ చిన్న విషయానికి రెచ్చిపోయిన నిషాన్ ఇనుప రాడ్ తీసుకుని చంద్రబోస్ తలపగలగోట్టాడు.
ఆ తర్వాత అతనిని హమ్మర్ కారు బ్యానెట్ మీద వేసి గోడకు పదేపదే గుద్దడంతో చంద్రబోస్‌కు తీవ్రగాయాలైనాయి. 18 రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన చంద్రబోస్ మరణించాడు. తప్పించుకు తిరుగుతున్న నిషాన్‌ను ఫిబ్రవరి 16వ తేదిన త్రిశూర్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. విషయం తెలుసుకున్న కబ్బన్ పార్క్ పోలీసులు బాడివారెంట్ మీద నిషాన్‌ను బెంగళూరు తీసుకు వచ్చి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications