హనీమూన్ దంపతుల మిస్సింగ్ మిస్టరీ- సీసీటీవీ ఫుటేజీలో..!!

మేఘాలయాలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కు చెందిన నవదంపతులు రాజా రఘువంశీ, ఆయన భార్య సోనమ్ రఘువంశీ మిస్సింగ్ కేసు వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ డిమాండ్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు ఆయన కేంద్రం హోం మంత్రిత్వ శాఖకు లేఖ సైతం రాశారు.

హనీమూన్ కోసం మేఘాలయాకు వెళ్లిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ ఉదంతం విషాదంతమైంది. రాజా రఘువంశీ దారుణ హత్యకు గురి అయ్యాడు. ఆయన భార్య సోనమ్ రఘువంశీ అదృశ్యం అయ్యారు. రోజులు గడుస్తున్నప్పటికీ ఈ మిస్టరీ వీడట్లేదు. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది.

తొలుత రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. ఆయన భార్య సోనమ్ రఘువంశీ జాడ ఇప్పటికీ దొరకట్లేదు. ఆమె కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఘాతుకానికి పాల్పడిందెవరనేది ఎవరో తేల్చడానికి పోలీసులు ప్రయత్నిస్తోన్నారు.

మేఘాలయ పర్యటనలో విషాదం

ఇండోర్ కు చెందిన రాజా రఘువంశీ దంపతులు.. మే 20వ తేదీన మేఘాలయాకు బయలుదేరి వెళ్లారు. మే 22వ తేదీన షిల్లాంగ్‌లోని ఓ హోటల్ కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు పోలీసులకు లభించాయి. వాళ్లు కనిపించడం అదే చివరిసారి.

మే 23వ తేదీన ఆ దంపతులు షిల్లాంగ్‌లోని హోటల్ నుండి చెక్ అవుట్ చేసి చిరపుంజీకి వెళ్లారు. ఆ మధ్యాహ్నం వారు చివరిసారిగా తమ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆడియో క్లిప్‌లో సోనమ్ తన అత్తగారితో మాట్లాడారు. తాము ఓ ఉపవాసం మధ్యలో ఉన్నామని, హైకింగ్‌కు వెళ్తున్నామని, గమ్యస్థానానికి చేరుకున్నాక ఫోన్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. మే 24న వారు అద్దెకు తీసుకున్న స్కూటీ ఒక కాలువ పక్కన గుర్తించారు.

కనిపించకుండా పోయిన వారం రోజుల తరువాత అంటే.. జూన్ 2వ తేదీన రాజా రఘువంశీ మృతదేహం.. స్కూటీ లభించిన ప్రదేశానికి సమీపంలో ఓ లోయలో గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అది హత్యగా తేలింది. అతని మొబైల్ ఫోన్, హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న ఒక మారణాయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని భార్య సోనమ్ రఘువంశీకి సంబంధించిన ఆచూకీ ఏదీ లభించలేదు. ఆమె కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

రెయిన్‌కోట్ లభ్యం.. కొనసాగుతున్న సోనమ్ ఆచూకీ గాలింపు

దర్యాప్తు కొనసాగిస్తోన్న పోలీసులకు రక్తపు మరకలు ఉన్న నల్లటి రెయిన్‌కోట్ లభ్యమైంది. ఆ రెయిన్‌కోట్.. కనిపించకుండా పోయిన సోనమ్ రఘువంశీకి చెందినది కావచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఈస్ట్ ఖాసీ హిల్స్ పోలీస్ సూపరింటెండెంట్ వివేక్ సియెమ్ తెలిపారు. దీన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.

సోనమ్ రఘువంశీ కోసం మేఘాలయా పోలీసులతో పాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) గాలింపు చర్యల్లో దిగారు. ఆమె కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ఈ విషయంపై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా స్పందించారు. రాజా రఘువంశీ దంపతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ హత్య, అదృశ్యం మిస్టరీని పరిశీలించడానికి బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగేలా చూడడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామని మేఘాలయ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం అన్ని కోణాల్లో విచారణ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+