నటుడు ప్రకాష్ రాజ్ పరువు రూ.1, ప్రతిష్ట పావలా: బీజేపీ ఎంపీ సింహా!

Recommended Video

    నటుడు ప్రకాష్ రాజ్ పరువు రూ.1, ప్రతిష్ట పావల | Oneindia Telugu

    బెంగళూరు: సమాజంలో బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ పరువుకు ఉన్న విలువ ఒక్క రూపాయి, ఈ విషయం స్వయంగా ఆయనే అంగీకరించారు, ఇక ఆయన ప్రతిష్ట గురించి కొత్తగా తాను చెప్పేది ఏమి లేదని కర్ణాటకలోని మైసూరు-కొడుగు లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా అన్నారు. ప్రకాష్ రాజ్ కు ఒక్క రూపాయికి మించిన విలువ సమాజంలో లేదని బహిరంగంగా ఆయనే అంగీకరించారని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఎద్దేవ చేశారు.

    రీల్ లైఫ్, రియల్ లైఫ్

    రీల్ లైఫ్, రియల్ లైఫ్

    ప్రకాష్ రాజ్ సినిమాలల్లో విలన్ గా బాగా నటిస్తారని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఎద్దేవ చేశారు. వెండి తెరమీద ప్రకాష్ రాజ్ ను చూసిన సినీప్రేక్షకులు ఆయన విలనిజంతో అసహ్యించుకుంటారని, నిజజీవితంలో కూడా ప్రకాష్ రాజ్ ప్రజల పాలిట విలన్ గా తయారైనాడని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఆరోపించారు.

    కోర్టుకు నటుడు ప్రకాష్ రాజ్

    కోర్టుకు నటుడు ప్రకాష్ రాజ్

    తన పరువుకు భగం కలిగించేలా బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా సోషల్ మీడియాలో వరుసగా ఆరోపణలు చేశారని, ఆయన మీద చర్యలు తీసుకోవాలని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మైసూరు కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు భంగం కలిగిందని పత్రాప్ సింహా నుంచి ఒక్కరూపాయి నష్టపరిహారం ఇప్పించాలని ప్రకాష్ రాజ్ కోర్టులో మనవి చేశారు.

    పావలాకు వేసుకోండి

    పావలాకు వేసుకోండి

    పరువు నష్టం దావా విషయంపై బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా బుధవారం మైసూరులో మీడియా సమవేశం ఏర్పాటు చేసి ప్రకాష్ రాజ్ మీద మండిపడ్డారు. ప్రకాష్ రాజ్ విలువ ఒక్క రూపాయి అని ఆయనే స్వయంగా కోర్టులో అంగీకరించారని, ఒక్కరూపాయి కాకపోతే పావలా (రూ. 25 పైసలు)కు వేసుకోవాలని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఎద్దేవ చేశారు.

    విమర్శించలేదు

    విమర్శించలేదు

    సినిమాల్లో ఒక్కోపాత్రకు ఒక్కో పేరు పెట్టుకుంటున్న ప్రకాష్ రాజ్ నిజ జీవితంలో ఊరికి ఒక పేరు పెట్టుకుని తిరుగుతున్నారని ప్రతాప్ సింహా ఆరోపించారు. ప్రకాష్ రాజ్ గురించి తేజస్విని అనే మహిళ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను తాను షేర్ చేశానని, అంతే కాని నేరుగా తాను ఎప్పుడూ ప్రకాష్ రాజ్ మీద ఆరోపణలు చెయ్యలేదని, కోర్టు వివరణ కోరితే కచ్చితంగా సమాధానం ఇస్తానని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా చెప్పారు.

    దమ్ముంటే రమ్మనండి

    దమ్ముంటే రమ్మనండి

    కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డేకు ఓటు వెయ్యరాదని ప్రకాష్ రాజ్ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా అవతారం ఎత్తాడని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఆరోపించారు. కర్ణాటకలోని 224 శాసన సభ నియోజక వర్గాల్లో ప్రకాష్ రాజ్ ఎక్కడో ఒక చోట పోటీ చెయ్యాలని, డిపాజిట్ కూడా దక్కకుండా ఓడించి కర్ణాటక నుంచి బయటకు పంపిస్తామని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా హెచ్చరించారు.

     సీఎంకే దిక్కులేదు

    సీఎంకే దిక్కులేదు


    కర్ణాటక సీఎం సిద్దరామయ్య అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయన సొంతా జిల్లా నుంచి తాను ఎంపీగా ఎన్నిక అయ్యానని, అది తన యోగ్యతని, ప్రకాష్ రాజ్ కనీసం గ్రామ పంచాయితీ సభ్యుడిగా కూడా గెలవలేడని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఆరోపించారు.

     ప్రధాని మోడీ భయంతో నీరవ్ మోడీ జంప్

    ప్రధాని మోడీ భయంతో నీరవ్ మోడీ జంప్

    వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి బ్యాంకుల్లో అంత రుణం రావడానికి కారణం అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మోడీ ప్రధాని అయిన తరువాత రుణం చెల్లించాలని ఒత్తిడి రావడంతో ఆయన భయంతో నీరవ్ మోడీ దేశం విడిచిపారిపోయాడని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా అన్నారు.

    కార్తీని కాదు చిదంబరం మీద !

    కార్తీని కాదు చిదంబరం మీద !


    కార్తీ చిదంబరం అరెస్టు విషయంపై మాట్లాడిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా అతను అవినీతికి పాల్పడటానికి అప్పట్లో అధికారంలో ఉన్న చిదంబరం కారణం అని ఆరోపించారు. కార్తీ చిదంబరంను కాదు అరెస్టు చెయ్యాల్సింది, కొడుకు అవినీతికి సహకరించిన చిదంబరంను అరెస్టు చెయ్యాలని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+