ఇస్రో గగనతలంపై అనుమానాస్పద విహారం ?

చెన్నై: భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) గగనతలంపై అనుమానాస్పందగా ఏదో తిరగుతుందని వార్తలు కలకలం సృష్టించాయి. స్థానిక గొర్రల కాపరులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు.

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరిలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) ఉపరితలం మీద అనుమానాస్పదంగా ఏదో తిరుగుతున్నదని స్థానిక గొర్రెల కాపరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమీపంలోని అటవి ప్రాంతం నుంచి అనుమానాస్పదంగా వచ్చిన ఆ విమానం ఇస్రో సమీపంలోని నిషేదిత ప్రదేశం ఏడో వాచ్ టవర్ దగ్గర ఆకాశంలో తిరిగిందని గొర్రెల కాపర్లు అంటున్నారు. పోలీసులు, అటవి శాఖ అధికారులు పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు.

Mysterious flying object sighted sighted over ISRO center in Tamil Nadu

అయితే ఇస్రో అధికారులు మాత్రం ఈ వార్తలను అధికారికంగా దృవీకరించలేదు. అకాశంలో విమానం ఎగిరిన సంకేతాలేవీ శాస్త్రీయంగా తమకు అందలేదని అధికారులు అంటున్నారు. ఈ విషయంపై ఇస్రో అధికారులకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.

సుమారు 55 కిలో మీటర్ల దూరం నుంచే గగనతలంలో సంచరిచేవాటిని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం తమ దగ్గర ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే పోలీసులు, అటవి శాఖ అధికారులు మాత్రం ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు.

గొర్రెల కాపరులు ఇచ్చిన సమాచారం మేరకు ఏడో వాచ్ టవర్ దగ్గర నిఘా పెట్టారు. గొర్రెల కాపరులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+