మాజీ సీఎం కాళ్లు పట్టుకున్న సింహాం, ఈసారి టిక్కెట్ ఇప్పించండి మహాప్రభో, ఒకేఒక్క చాన్స్ !
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన బీజేపీ, జేడీఎస్‌లు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీకిక చెక్ పెట్టి ఎక్కువ సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీలో చాలా మంది సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు దక్కకుండా పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీ, జేడీఎస్ నాయకులు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మైసూరు-కొడుగు లోక్ సభ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన ప్రతాప్ సింహాకు ఈసారి టికెట్ దక్కడం అనుమానమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. గురువారం పలువురు సీనియర్ నేతలు లోక్‌సభ ఎన్నికలపై సమావేశం నిర్వహించగా, ఈ సమావేశంలో ప్రతాప్‌సింహాకు టిక్కెట్ ఇచ్చే అంశంపై చర్చలు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామిని బిడదిలోని ఫామ్ హౌస్ కు వెళ్లిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఆయన్ను కలవడం పలు ప్రశ్నలకు దారితీసింది.

ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల టిక్కెట్ కోసం వి సోమన్న, సీటీ రవి సహా పలువురు నేతలు మాజీ సీఎం కుమారస్వామితే సమావేశమయ్యారు, ఇప్పుడు ప్రతాప్ సింహా కూడా మాజీ సీఎంహెచ్‌డీ కుమారస్వామిని కలిశారు. మైసూరు- కొడగు లోక్‌సభ టిక్కెట్ తనకు ఇప్పించే విషయంలో మీరు తనకు సహాయం చెయ్యాలని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామికి మనవి చేశారని తెలిసింది.
మైసూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి ఈసారి ప్రతాప్ సింహాకు టికెట్ ఇవ్వడంపై బీజేపీలో మిశ్రమ స్పందన వచ్చింది. బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా తనకు మద్దతివ్వాలని, నా పేరును బీజేపీ హౌకమాండ్ కు మీరు సిఫారసు చేయాలని మనవి చేస్తూ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామితో మంతనాలు జరిపారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మైసూరు ప్రాంతానికి చెందిన ఒక్కలిగ నేత, హిందూ మతం ద్వారా గుర్తింపు పొందిన ప్రతాప్ సింహాకు టికెట్ ఇచ్చే విషయంలో బీజేపీ హైకమాండ్ నేతలతో మాట్లాడేందుకు మీరు తనకు సహకరించాలని బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మాజీ సీఎం కుమారస్వామితో చర్చించినట్లు సమాచారం. అలాగే మైసూరు- కొడగు ఎంపీ ప్రతాప్ సింహా కూడా మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామితో భేటీ అయిన విషయంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంపీ ప్రతాప్ సింహా మాజీ సీఎం కుమారస్వామి దగ్గరకు వెళ్లి ఆయన కాళ్లపై పడి నమస్కరించారని, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయని కన్నడ మీడియా కోడై కూస్తోంది.












Click it and Unblock the Notifications