భారత ఆర్మీ అమ్ములపొదిలోకి నాగాస్త్ర-2 ఆత్మాహుతి డ్రోన్లు.. ప్రత్యేకతలివే!

భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరో శక్తివంతమైన స్వదేశీ అస్త్రం చేరింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నాగాస్త్ర-2 యాంటీ ట్యాంక్ లాయిటరింగ్ మ్యూనిషన్ వ్యవస్థను భారత ఆర్మీకి అప్పగించింది. ఇది ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి మరో ముఖ్యమైన అడుగుగా చెప్పొచ్చు.

నాగాస్త్ర-2 ప్రత్యేకత ఏమిటంటే ఇది గాల్లో చక్కర్లు కొడుతూ శత్రు కదలికలను పసిగట్టి, సరైన సమయంలో ఆత్మాహుతి దాడి చేస్తుంది. పగలు, రాత్రి వేళల్లోనూ నిఘా పెట్టగల అత్యాధునిక కెమెరాలు దీనిలో అమర్చారు. 4 కిలోల ట్యాండమ్ షేప్డ్-ఛార్జ్ వార్‌హెడ్ ఉంది. ఇది 650 మిల్లీమీటర్ల మందపాటి ఉక్కు కవచం కలిగిన శత్రు ట్యాంకులను కూడా చీల్చివేయగల సామర్థ్యం కలిగి ఉంది.

Nagastra-2 suicide drones Solar Defence Delivers Indigenous Nagastra-2 Anti-Tank Loitering Munitions to Indian Army

ఈ డ్రోన్ ఏకధాటిగా 60 నిమిషాల పాటు గాల్లో ఎగురుతూ లక్ష్యాలను వేటాడగలదు. దాడిని విరమించుకుంటే 25 కిలోమీటర్ల పరిధిలో తిరిగి సురక్షితంగా వెనక్కి రప్పించి మళ్లీ ఉపయోగించుకోవచ్చు. ఫైర్ అండ్ ఫర్‌గెట్ మోడ్‌లో 50కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలదు. ఆధునిక యుద్ధరంగంలో శత్రువులు చేసే జీపీఎస్ జామింగ్, కమ్యూనికేషన్ జామింగ్, స్పూఫింగ్ వంటి ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సవాళ్లను తట్టుకునేలా ఎలక్ట్రానిక్ కౌంటర్-కౌంటర్ మెజర్స్ సాంకేతికతను కూడా జోడించారు.

ఆగస్టు 2026లో మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో సాంకేతిక పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. లద్దాఖ్, ఝాన్సీ సమీపంలోని బబినా వంటి ప్రాంతాల్లో కూడా పరీక్షించారు. కొద్ది రోజుల క్రితమే అదే సంస్థ 450 నాగాస్త్ర-1ఆర్ లాయిటరింగ్ మ్యూనిషన్లను సైన్యానికి అందించింది. ఇది అత్యవసర సేకరణ కింద ఇచ్చిన ఆర్డర్. నాగాస్త్ర-1ఆర్ స్వల్ప శ్రేణి కార్యకలాపాలకు అనువుగా రూపొందించారు.

డిసెంబర్ లో తెలంగాణాకు ప్రధాని మోదీ.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు కీలకప్రాజెక్టులు ప్రారంభం!
డిసెంబర్ లో తెలంగాణాకు ప్రధాని మోదీ.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు కీలకప్రాజెక్టులు ప్రారంభం!

నాగాస్త్ర-2 సరిహద్దుల్లో శత్రు సాయుధ వాహనాలు, ట్యాంకులను ఎదుర్కోవడంలో భారత సైన్యానికి కీలక అస్త్రంగా మారనుంది. తక్కువ ఖర్చుతో అధిక కచ్చితత్వం అందించే ఈ స్వదేశీ వ్యవస్థ రక్షణ రంగంలో స్వావలంబనను మరింత బలోపేతం చేస్తుంది. సోలార్ డిఫెన్స్ సంస్థ ఇలాంటి వ్యవస్థల్లో 80 శాతానికి పైగా స్వదేశీ విషయాలు ఉపయోగించి అభివృద్ధి చేస్తోంది. ఇది భారత రక్షణ సామర్థ్యాలను మెరుగుపరిచే కీలకమైన అడుగు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+