వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral: రోడ్డు పక్కన నమాజ్ చేశారని ఏం చేశారంటే ?, ఎవరిని అడిగి చేశారు ?, సోషల్ మీడియాలో వైరల్ !

|
Google Oneindia TeluguNews

లక్నో/ శహజహాన్ పూర్: పలు వాహనాల్లో ముస్లీం సోదరులు వేరే రాష్ట్రంలో ఉన్న ఆజ్మీర్ దర్గాను సందర్శించడానికి బయలుదేరారు. మార్గం మద్యలో నమాజ్ చెయ్యడానికి సమయం దగ్గర పడటంతో రోడ్డు పక్కన వాహనం నిలిపారు. ముస్లీం సోదరులు శుభ్రంగా కాళ్లు, చేతులు, ముఖం కడుక్కొని రోడ్డు పక్కన నమాజ్ చేశారు. ఆ సందర్బంలో అక్కడికి వెళ్లిన ఓ వర్గం వాళ్లు రోడ్డు పక్కన నమాజ్ చేస్తారా ?, మీకు ఎంత ధైర్యం ?, మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా ? అంటూ రెచ్చిపోయారు. రోడ్డు పక్కన నమాజ్ చేసిన కొందరితో క్షమాపణలు చెప్పించడం, మరికొందరి దగ్గర గుంజీలు తీయించడం చేశారు. ఆ సందర్బంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Sadist: భార్య కాళ్లు, చేతులు కట్టేసి ప్రైవేట్ పార్ట్ లో ఫెవికిక్ వేసిన భర్త, మ్యాటర్ తెలిసి షాక్, వీడు మొగుడేSadist: భార్య కాళ్లు, చేతులు కట్టేసి ప్రైవేట్ పార్ట్ లో ఫెవికిక్ వేసిన భర్త, మ్యాటర్ తెలిసి షాక్, వీడు మొగుడే

అజ్మీర్ దర్గాకు వెళ్లాలని ?

అజ్మీర్ దర్గాకు వెళ్లాలని ?


పశ్చిమ బెంగాల్ కు చెందిన కొందరు ముస్లీం సోదరులు రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాను సందర్శించి ప్రత్యేక పూజలు చెయ్యాలని అనుకున్నారు. ముస్లీం సోదరులు సామూహికంగా దర్గాను సందర్శించాలని అనుకుని కొంతకాలం నుంచి అందరికి అనుకూలంగా ఉన్న సమయంలోనే ఆజ్మీద్ దర్గాకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

ఉత్తరప్రదేశ్ లో ఎంట్రీ

ఉత్తరప్రదేశ్ లో ఎంట్రీ

కొన్ని వాహనాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి ముస్లీం సోదరులు రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఆజ్మీర్ దర్గాను సందర్శించడానికి బయలుదేరారు ముస్లీం యాత్రికులు ఉత్తరప్రదేశ్ లోని శహజహాన్ పూర్ జిల్లాలోని తిల్లార్ ప్రాంతంలోకి వెళ్లారు. ఆ సమయంలో నమాజ్ చెయ్యడానికి సమయం దగ్గర పడటంతో ముస్లీం సోదరులు రోడ్డు పక్కన వాహనం నిలిపారు.

ఎవరిని అడిగి నమాజ్ చేశారు ?, మీకు ఎంతధైర్యం

ఎవరిని అడిగి నమాజ్ చేశారు ?, మీకు ఎంతధైర్యం

ముస్లీం సోదరులు శుభ్రంగా కాళ్లు, చేతులు, ముఖం కడుక్కొని రోడ్డు పక్కన నమాజ్ చేశారు. ఆ సందర్బంలో వీహెచ్ పీ కార్యకర్తలు అని చెప్పుకుని అక్కడికి వెళ్లిన ఓ వర్గం వారు రోడ్డు పక్కన నమాజ్ చేస్తారా ?, మీకు ఎంత ధైర్యం ?, మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా ?, ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు, మా రాష్ట్రంలో బహిరంగంగా నమాజ్ చెయ్యడం నిషేధం అని మీకు తెలుసా అంటూ రెచ్చిపోయారని సమాచారం.

 నమాజ్ చేసినందుకు గుంజీలు తీయించారు

నమాజ్ చేసినందుకు గుంజీలు తీయించారు

రోడ్డు పక్కన నమాజ్ చేసిన కొందరితో క్షమాపణలు చెప్పించడం, మరికొందరి దగ్గర గుంజీలు తీయించడం చేశారు. ఆ సందర్బంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయంపై శహజహాన్ పూర్ జిల్లా ఎస్పీ ఎస్. ఆనంద్ స్థానిక మీడియాకు వివరణ ఇచ్చారు. రాజస్థాన్ కు చెందిన కొందరు ఇక్కడ రోడ్డు పక్కన నమాజ్ చేశారని, ఆ సందర్బంలో వీహెచ్ పీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారని అన్నారు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

సోషల్ మీడియాలో వీడియో వైరల్


అజ్మీర్ దర్గాకు వెలుతున్న కొందరు ఫిర్యాదు చెయ్యడంతో కొందరిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేశామని మరో సీనియర్ పోలీసు అధికారి సంజీవ్ వాజ్ పేయి చెప్పారని స్థానిక మీడియా తెలిపింది. మొత్తం మీద అజ్మీర్ దగ్గరకు వెలుతున్న ముస్లీంలు రోడ్డు పక్కన నమాజ్ చేశారని ఆరోపిస్తూ వారితో గుంజీలు తీయించడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది.

English summary
Namaz: VHP activists make pilgrims apologise for offering namaz on road in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X