Cheetah: నాలుగు పిల్లలకు జన్మచ్చిన చీతా.. ట్విట్టర్‍లో వెల్లడించిన మంత్రి..
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతపులి ఒకటి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. చిరుతల్లో ఒకటైన సాషా కిడ్నీ వ్యాధి కారణంగా మరణించిన మూడు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. చిరుతపులికి పిల్లలు పుట్టినట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. "2022 సెప్టెంబర్ 17న ఇండియాకు తీసుకొచ్చినన ఓ చీతాకు నాలుగు పిల్లలు పుట్టాయని చెప్పేందుకు సంతోషిస్తున్నాను. గతంలో జరిగిన పర్యావరణపరమైన తప్పులను సరిదిద్దతూ చీతాలను భారత్ కు తిరిగి తీసుకురావడంలో కృషి చేస్తోన్న బృందాన్ని అభినందిస్తున్నానని" అని ట్వీట్ చేశారు.
Congratulations 🇮🇳
— Bhupender Yadav (@byadavbjp) March 29, 2023
A momentous event in our wildlife conservation history during Amrit Kaal!
I am delighted to share that four cubs have been born to one of the cheetahs translocated to India on 17th September 2022, under the visionary leadership of PM Shri @narendramodi ji. pic.twitter.com/a1YXqi7kTt
చనిపోయిన సాషా, మరో ఏడు పెద్ద పిల్లులతో పాటు ఆఫ్రికన్ దేశం నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (KNP)కి తీసుకొచ్చారు. నాలుగున్నర సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఆడ చిరుత సాషా చనిపోవడంతో ప్రాజెక్ట్ చీతాకు ఎదురుదెబ్బ తగిలింది. కానీ మరో చితాకు నలుగు పిల్లలు పుట్టడం శుభపరిణామం అని జూ అధికారులు తెలిపారు. ఈ జాతి చిరుత పులులు అంతరించిపోయిన ఏడు దశాబ్దాల తర్వాత, వాటిని పునరుద్దరించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

గత ఏడాది సెప్టెంబరు మధ్యలో నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను తీసుకొచ్చి షియోపూర్ జిల్లాలోని కెఎన్‌పిలో తీసుకొచ్చారు.మిగిలిన ఏడు చిరుతలు బాగున్నట్లు అధికారులు తెలిపారు. ఈ చిరుతల్లో మూడు మగ, ఒక ఆడ చిరుతను పార్క్‌లోని ఓపెన్ ఫారెస్ట్ ఏరియాలో విడుదల చేశామన్నారు. అవి పూర్తిగా ఆరోగ్యంగా, చురుకుగా, సాధారణ పద్ధతిలో వేట సాగిస్తున్నాయని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పిసిసిఎఫ్-వైల్డ్ లైఫ్) జెఎస్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

గత నెలలో దక్షిణాఫ్రికా నుండి కెఎన్‌పికి తీసుకువచ్చిన పన్నెండు చిరుతలను ప్రస్తుతం క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. అవి ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నాయని ఒక అధికారి పిటిఐకి తెలిపారు. భారతదేశంలోని చివరి చిరుత 1947లో ప్రస్తుత ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో మరణించింది
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications