Tarakaratna: ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు, తరలి వస్తున్న నందమూరి, నారా ఫ్యాన్స్ !
బెంగళూరు/హైదరాబాద్/కుప్పం: సినీ నటుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు మనుమడు, నందమూరి తారకరత్న తుది శ్వాస విడిచారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో ఇన్ని రోజులు చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. శివరాత్రి పండుగ రోజు నందమూరి తారకరత్న చనిపోవడంతో నందమూరి అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. భారీ సంఖ్యలో నందమూరి, నారా చంద్రబాబు నాయుడు అనుచరులు, టీడీపీ అభిమానులు నారాయణ హృదయాలయ ఆసుపత్రి దగ్గరకు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రి దగ్గరకు బెంగళూరు పోలీసులు అదనపు పోలీసు బలగాలను తరలించారు.

కుప్పంలో కుప్పకూలిన తారకరత్న
కుప్పంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభం రోజు నందమూరి తారకరత్న పాల్గొన్నారు. పాదయాత్రలో ఉన్న నందమూరి తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తరువాత తారకరత్నకు స్థానిక ఆసుపత్రుల్లో ప్రథమ చికిత్స చేచించి తరువాత బెంగళూరులోని
నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.

నందమూరి, నారా ఫ్యామిలీ ఎంట్రీ
నందమూరి ఫ్యామిలీలో బాలక్రిష్ణ, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, జూనీరియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ ఫ్యామిలీతో పాటు నందమూర్తి కుటుంబ సభ్యులు అందరూ బెంగళూరు చేరుకుని తారకరత్నను చూసి వెళ్లారు. నందమూరి తారకరత్న కోలుకోవాలని నందమూరి అభిమానులు బెంగళూరుతో పాటు హైదరాబాద్ లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు.

ఆసుపత్రి దగ్గర భారీ బందోబస్తు
తారకరత్నను బతికించాలని వైద్యులు చేసిన ప్రయత్నాలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. శివరాత్రి రోజు నందమూరి తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శనివారం రాత్రి నందమూరి తారకరత్న మరణించడంతో బెంగళూరులోని నందమూరి అభిమనులు నారాయణ హృదయాలయ ఆసుపత్రి దగ్గరకు పరుగు తీశారు. భారీ సంఖ్యలో నందమూరి అభిమానులు నారాయణ హృదయాలయ ఆసుపత్రి దగ్గరకు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఆసుపత్రి దగ్గరకు బెంగళూరు పోలీసులు అదనపు పోలీసు బలగాలను తరలించారు.












Click it and Unblock the Notifications