ప్రధానిగా నరేంద్ర మోడీ అనర్హుడు, నీరవ్ మోడీ, లలిత్ మోడీ వెనక వీళ్లే, సీఎం సిద్దూ!
బెంగళూరు: భారతదేశ ప్రధాన మంత్రి పదవికి నరేంద్ర మోడీ అనర్హుడని, ఆయన ప్రధాని కావడం మన దురదృష్టమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. జైలుకు వెళ్లిన వ్యక్తులను పక్కనే పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు ఎలా విమర్శలు చేస్తారని ప్రధాని నరేంద్ర మోడీని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు.

జైలుకు వెళ్లిన అమిత్ షా
బెళగావి జిల్లాలోని అథణిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో సీఎం సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోడీ మీద విమర్శలు గుప్పించారు. అమిత్ షా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యనాయుడు జైలుకు వెళ్లి వచ్చారని సీఎం సిద్దరామయ్య గుర్తు చేశారు.

సిగ్గుచేటు
అమిత్ సా, బీఎస్ యడ్యూరప్ప, కట్టా సుబ్రమణ్యనాయుడిని పక్కనే పెట్టుకుని నరేంద్ర మోడీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం 10 శాతం కమీషన్లు తీసుకుంటుందని విమర్శించడం సిగ్గుచేటు అని సిద్దరామయ్య ఆరోపించారు.

నీరవ్ మోడీ, లలిత్ మోడీ
వేల కోట్ల రూపాయల స్కాంలో చిక్కుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీతో సహ లలిత్ మోడీ దేశం విడిచిపారిపోవడానికి దారి ఎవరు చూపించారు అనే విషయం చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. మోసాలు చేసిన వారిని బీజేపీ దేశం దాటిస్తోందని సిద్దరామయ్య ఆరోపించారు.

వందశాతం కమిషన్
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 10 శాతం కమిషన్లు తీసుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపిస్తున్నారని, అదే నిజం అయితే అంతకు ముందు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నూరు శాతం కమిషన్లు తీసుకుందని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.












Click it and Unblock the Notifications