బేటీ బచావో బేటీ పఢావో: మాధురిని ప్రశంసించిన ప్రధాని మోడీ(ఫోటోలు)

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ బేటీ బచావో బేటీ పఢావో పథకంలో భాగంగా సుకన్యా సమృద్ధి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. హర్యానాలోని పానిపట్‌లో ఆయన ఐదుగురు బాలికలకు పాస్ బుక్‌లు పంపిణీ చేసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ లింగ వివక్ష నిర్మూలనే లక్ష్యంగా ఈ పథకం ప్రవేశపెట్టామని అన్నారు. ఆడపిల్లల రక్షణలో సమాజం పాత్ర ఎంతో ఉందని చెప్పారు. గతంలో ఎం జరిగిందన్న విషయాన్ని మరిచి లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

అమ్మాయిలు చదువుకుంటేనే సమాజంలో ఉన్నతంగా జీవిస్తారని అన్నారు. చదువు లేకపోతే పిల్లలు సమస్యల పరిష్కారంలో విఫలమవుతారని ఆడపిల్లల తల్లిదండ్రులు గుర్తించాలని అన్నారు.

పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేనకా గాంధీ మాట్లాడుతూ ఆడిబడ్డకు గౌరవం, రక్షణ ప్రధాన లక్ష్యాలుగా, లింగ వివక్ష నిర్మూలన దిశగా చైతన్యం తీసుకురావడమే ధ్యేయంగా ఈ పథకం ప్రారంభిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు. తల్లికి అనారోగ్యంగా ఉన్నా, మాధురి ఈ కార్యక్రమానిక హాజరవడం ప్రధాని మోడీని ఆకట్టుకుంది. దీంతో ఆమెను ప్రశంసిస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. "మాధురి గారు కూడా మాతో ఉన్నారు. తల్లికి అనారోగ్యంగా ఉన్నా పానిపట్ వచ్చారు. స్త్రీ శిశువలను కాపాడాలంటూ మంచి సందేశాన్నిచ్చారు" అని పేర్కొన్నారు.

లింగ వివక్ష నిర్మూలనే లక్ష్యంగా బేటీ బచావో బేడీ పఢావో: ప్రధాని మోడీ

లింగ వివక్ష నిర్మూలనే లక్ష్యంగా బేటీ బచావో బేడీ పఢావో: ప్రధాని మోడీ


బేటీ బచావో బేడీ పఢావో పథకంలో భాగంగా సుకన్యా సమృద్ధి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పుష్పగుచ్ఛం ఇచ్చిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.

లింగ వివక్ష నిర్మూలనే లక్ష్యంగా బేటీ బచావో బేడీ పఢావో: ప్రధాని మోడీ

లింగ వివక్ష నిర్మూలనే లక్ష్యంగా బేటీ బచావో బేడీ పఢావో: ప్రధాని మోడీ


హర్యానాలోని పానిపట్‌లో ఆయన ఐదుగురు బాలికలకు పాస్ బుక్‌లు పంపిణీ చేసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ లింగ వివక్ష నిర్మూలనే లక్ష్యంగా ఈ పథకం ప్రవేశపెట్టామని అన్నారు.

లింగ వివక్ష నిర్మూలనే లక్ష్యంగా బేటీ బచావో బేడీ పఢావో: ప్రధాని మోడీ

లింగ వివక్ష నిర్మూలనే లక్ష్యంగా బేటీ బచావో బేడీ పఢావో: ప్రధాని మోడీ


ఆడపిల్లల రక్షణలో సమాజం పాత్ర ఎంతో ఉందని చెప్పారు. గతంలో ఎం జరిగిందన్న విషయాన్ని మరిచి లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. అమ్మాయిలు చదువుకుంటేనే సమాజంలో ఉన్నతంగా జీవిస్తారని అన్నారు.

లింగ వివక్ష నిర్మూలనే లక్ష్యంగా బేటీ బచావో బేడీ పఢావో: ప్రధాని మోడీ

లింగ వివక్ష నిర్మూలనే లక్ష్యంగా బేటీ బచావో బేడీ పఢావో: ప్రధాని మోడీ


ఈ కార్యక్రమంలో కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.

'సుకన్యా సమృద్ధి ఖాతా'లో దాచే మొత్తాలకు 9.1 శాతం వడ్డీ

బాలికల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన డిపాజిట్ పథకం "సుకన్య సమృద్ధి ఖాతా"లో దాచుకునే మొత్తాలపై ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 9.1 శాతం వడ్డీని ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో బాలిక పేరుపై ఖాతాలను ప్రారంభించి డబ్బు జమ చేయవచ్చు.

10 ఏళ్ల వయసు లోపు బాలికల పేరు మీద ఈ పథకం కింద బ్యాంకు ఖాతను ప్రారంభించవచ్చు. ఆ అమ్మాయికి 21 ఏళ్లు వయసు వచ్చిన తర్వాత కావాలనుకుంటే బాలిక చదువు నిమిత్తం ఆ మొత్తాన్ని బ్యాంకు నుంచి తీసుకోవచ్చు.

ఒకవేళ బాలిక కుటుంబం ఇతర ప్రాంతాలకు బదిలీపైనో, మరో కారణం చేతనో వెళితే, కొత్తగా వచ్చిన చోటికి బ్యాంకు ఖాతాను కూడా మార్పించుకోవచ్చు. పదేళ్ల వయసు వచ్చిన తర్వాత నుంచీ సంబంధిత బాలిక తన బ్యాంకు ఖాతాను నేరుగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+