ముహుర్తం ఫిక్స్.. గురువారం సాయంత్రం 7గంటలకు ప్రధానిగా మోడీ...

ఈనెల 30న సాయంత్రం 7గంటలకు ప్రధాని నరేంద్రమోడీ రెండవసారి రాష్ట్ర్రపతి భవనలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర్రపతి రాంనాథ్ కోవింద్ ట్విట్టర్లో పేర్కోన్నారు. కాగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే మోడీ రాష్ట్ర్రపతిని కలిశారు.ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ప్రధాని మోడీ ఆయన తల్లి హీరాబేన్ ఆశీర్వాదం తీసుకునేందుకు సోమవారం గుజరాత్ వెళ్లనున్నారు. అనంతరం వారణాసీలో కూడ మోడీ పర్యటించనున్నారు.

ఇక మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రపంచదేశాధినేతలను కూడ ఆహ్వానించేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు పీ 5దేశాలను కూడ మోడీ అహ్వానించనుట్టు వార్తలు వెలువడ్దాయి..భారత దేశంలో 50సంవత్సరాల రాజకీయ చరిత్రను తిరగరాసిన మోడీ అంత్యంత వైభవంగా ప్రమాణస్వీకారాన్ని కొనసాగించాలని బీజేపీ భావిస్తోంది.

Narendra Modi will take oath at 7pm on 30th

ఇక ప్రధానమంత్రితోపాటు పలువురు మంత్రులు కూడ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడ ఉన్నాయి. కొత్తమంది ముఖ్యులతో పాటు తెలంగాణ ప్రాంతానికి సరైన ప్రాతినిథ్యం కల్లించనున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే సికింద్రబాద్ నుండి గెలిచిన కిషన్‌రెడ్డి,తోపాటు నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితపై విజయబావుటాను ఎగరవేసిన ధర్మపురి అర్వింద్‌కు కూడ మంత్రివర్గ విస్తరణ అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రం నుండి బీజేపీకి సరైన ప్రాతినిథ్యం కల్పించనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+