వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్దూపై కన్నేసిన కాంగ్రెస్..! పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ముందు చూపనుకున్నారో..! లేక తొందరపడ్డారో..! గానీ మొత్తానికి ఉన్న పదవికి రాజీనామా చేసి జంక్షన్ లో నిలబడ్డారు మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూ. దీంతో అటు బీజేపీకి, ఇటు ఆమ్ ఆద్మీకి కాకుండా పోయింది ఆయన పరిస్థితి. సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ఆశతో రాజీనామా చేసేసిన సిద్దూకు ఆప్ హ్యాండ్ ఇచ్చేయడంతో ఇప్పుడేం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారాయన.

సరిగ్గా ఇదే అవకాశాన్ని ఇప్పుడు తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్. సిద్దూ తన భార్యకు కూడా టికెట్ కావాలని కోరడం.. ఆప్ దాన్ని తిరస్కరించడం.. ఆప్ విడుదల చేసిన పంజాబ్ సీఎం అభ్యర్థుల జాబితాలోను ఆయన పేరు లేకపోవడం తెలిసిన విషయమే. కావాలంటే స్టార్ క్యాంపెయినర్ (ప్రచారకుడిగా) అవకాశమిస్తాం గానీ సీఎం పదవికి మాత్రం 'నో' ఛాన్స్ అని తేల్చేసింది ఆప్. ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇవ్వడమన్నది తమ పార్టీ విధానపరమైన నిర్ణయాలకు విరుద్దమని చెప్పింది.

Navjot Sidhu may ditch AAP, join Congress: reports

కాగా, ఈ పరిస్థితులన్నింటినీ నిశితంగా గమనిస్తోన్న కాంగ్రెస్.. సిద్దూను తమవైపుకు తిప్పుకోవాలని చూస్తోంది. ఇందుకోసం సిద్దూతో పాటు సిద్దూ భార్యకు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలనే యోచనలో ఉందట కాంగ్రెస్. కుటుంబంలో ఒక్కరికే లాంటి నిబంధనలేవి కాంగ్రెస్ లో లేవు కాబట్టి.. సిద్దూతో పాటు ఆయన భార్యకు కూడా అమృతసర్ లోక్ సభ టికెట్ ఇచ్చి పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయట.

అలాగే భవిష్యత్తులో.. సీఎం పదవి కాకపోయినా డిప్యూటీ సీఎం పదవిని ఇస్తామని సిద్దూను కాంగ్రెస్ ఊరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇవన్నీ ప్రతిపాదనలో దశలో ఉండగా.. చర్చలకు సిద్దూ ఓకె చెబితే వీటిపై ఓ క్లారటి వచ్చే అవకాశముంది. చూడాలి మరి సిద్దూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..!

English summary
Former Bharatiya Janata Party (BJP) Rajya Sabha MP Navjot Singh Sidhu's joining the Aam Aadmi Party is hanging fire, since the cricketer-turned politician failed to cut an ice with the AAP leadership over his demand of the party's chief ministerial candidature in Punjab, and a ticket for his wife Navjot Kaur in the upcoming assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X