నిర్ధారణ: మోడీ ప్రమాణ స్వీకారానికి నవాజ్ షరీఫ్
న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరు కానున్నారు. ఈ మేరకు పీఎంఎల్ పార్టీ అధికారికంగా ప్రకటనను జారీ చేసింది. షరీఫ్ రాకతో భారత్-పాకిస్థాన్ మధ్య కొత్త అధ్యాయం ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది.
మే 26వ తేదీన మోడీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షరీఫ్‌తో పాటు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ కూడా వస్తున్నారు. భారత ప్రధాని ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్ ప్రధాని రావడం ఇదే ప్రథమం.

ఢిల్లీ నుంచి ఆహ్వానం వెళ్లిన తర్వాత షరీఫ్ సానుకూలంగా ప్రతిస్పందిస్తారా, లేదా అనే విషయంపై పలు ఊహాగానాలు చెలరేగాయి. పాకిస్తాన్ సైన్యం ప్రధాని వెళ్లకూడదని సూచించినట్లు తెలుస్తోంది. మోడీ, షరీఫ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.
సార్క్ దేశాల అధిపతులను మోడీ తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వీనించిన తర్వాత పలు వివాదాలు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications