వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీతో పొత్తా, ఎక్కడి నుంచి తీసుకొస్తారు?: ఒమర్ అబ్దుల్లా, మోడీ షెడ్యూల్‌లో మార్పు లేదు: పీఎంవో

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ ఈసారి బీజేపీతో చేతులు కలబోతోందంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అసాధ్యమని అన్నారు. "ఇలాంటి విషయాలను మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీ ఇళ్లలో ఇలాంటి వార్తలను సృష్టిస్తారు. దానికి నేనేం చేయగలను? మా వైపు నుంచి అలాంటి ఆలోచనలు లేవు. మేమెలాంటి సంకేతాలను కూడా ఇవ్వలేదు" అని ఒమర్ స్పష్టం చేశారు.

కొంతమంది సీనియర్ జర్నలిస్టులు స్టోరీలు తయారుచేసి, సోర్స్ పేర్లు చెప్పకుండా, విశ్వసనీయ సమాచారం అని చెబుతారని, అలాంటి విషయాలు తనకు బాగా తెలుసన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో తన ఎలక్షన్ ర్యాలీలకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండటం శుభసూచకమని చెప్పారు.

NC's tie-up with BJP 'impossible': Omar Abdullah

గతంలో జరిగిన ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజల స్పందన చూడలేదని అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వర్కిండ్ ప్రెసిడెంట్‌గా తిరిగి సీఎం పీఠం దక్కించుకునేందుకు ఒమర్ అబ్దుల్లా జమ్మూ, బారాముల్లా, బుడ్గాం జిల్లాల్లో నిర్వహించిన ఎలక్షన్ మీటింగ్‌ల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సక్సెస్ చేశారు.

మోడీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదు: పీఎంవో

జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదని, ప్రచారం కొనసాగుతుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. జమ్మూ మూడద దశ ఎన్నికల్లో భాగంగా బారాముల్లా పబ్లిక్ మీటింగ్‌లో సోమవారం ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఐతే శుక్రవారం నాడు చోటుచేసుకున్న ఉగ్రవాద దాడులు నేపథ్యంలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ రద్దు చేస్తారేమో అని వార్తలు రావడంతో.. పీఎంవో ఈ ప్రకటన చేసింది.

English summary
J&K chief minister Omar Abdullah on Friday said it was "impossible" for his party, the National Conference (NC), to join hands with the BJP, trashing reports about the party giving any such indications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X