సర్వే: ఉత్తరాది, సీమాంధ్రలో ఎన్డీఏ స్వీప్, కాంగ్రెస్ బేజారు

దేశంలో దాదాపు పెద్ద రాష్ట్రాలన్నింటిలోను బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే హవా కొనసాగనుందని ఈ సర్వే తెలిపింది. కేవలం తమిళనాడులో మాత్రం ఎన్డీయే జోరు కాస్త తక్కువుందంట. సర్వే ప్రకారం... తమిళనాడులో ఇటు ఎన్డీయే, అటు యూపిఏ హవా ఏమాత్రం కనిపించదు.
లోకసభ ఎన్నికల్లో బిజెపి.. రాజస్థాన్‌లో 21-25, మధ్యప్రదేశ్‌లో 25-29, ఛత్తీస్‌గఢ్‌లో 8, జార్ఖండ్‌లో 10-14, కర్నాటకలో 16-28, ఢిల్లీలో 4 స్థానాల్లో గెలిచే అవకాశముంది. ఈ రాష్ట్రాల్లో 114 స్థానాలు ఉండగా 84 సీట్లు బిజెపి గెలుచుకుంటుంది.
బీహార్‌లో ఎన్డీయో కూటమి 21, మహారాష్ట్రలో 36, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రాంతాల్లో కలిపి 16 సీట్లను గెలుచుకుంటుందట. టిడిపి, బిజెపి పొత్తు కుదిరితే తెలంగాణలో 2, సీమాంధ్రలో 14 స్థానాలు గెలుచుకునే అవకాశముందట. మొత్తం 16 స్థానాలు. తమిళనాడులో 3 సీట్లకే పరిమితం కానుంది. ఈ రాష్ట్రాల్లో 169 స్థానాలు ఉండగా.. 76 లోకసభ స్థానాల్లో బిజెపి గెలువనుంది.
సర్వే ప్రకారం కాంగ్రెసు పార్టీ.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో 29 సీట్లను మాత్రమే గెలుచుకుంటుంది. యూపిఏ కూటమి బీహార్, జార్ఖండ్, మహారాష్ట్రలో 25 సీట్లు గెలుచుకుంటుంది. తమిళనాడులో అన్నాడిఎంకె హవా కొనసాగనుంది.
తమిళనాడులో అన్నాడిఎంకె 25, డిఎంకె 11, ఎన్డీయే 3 సీట్లు గెలుచుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి-బిజెపి కూటమి 16, కాంగ్రెసు, తెరాస 7 చొప్పున, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 10 స్థానాలు గెలుచుకోనుంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications