NEET UG 2024 Score Cards: నీట్ పరీక్ష ఫైనల్ స్కోరు కార్డుల విడుదల- ఇలా చెక్ చేసుకోండి..!

జాతీయ స్ధాయిలో వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష తుది స్కోరు కార్డులు విడుదలయ్యాయి. ఇప్పటివరకూ నీట్ రీటెస్ట్ నిర్వహించాలా వద్దా అన్న ఉత్కంఠ కొనసాగగా.. తాజాగా సుప్రీంకోర్టు ఆ ఆలోచన లేదని తేల్చిచెప్పేసింది. బీహార్ లోని రెండు నగరాల్లో మాత్రమే పేపర్ లీక్ లు జరిగాయని, కాబట్టి దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని తేల్చేసింది. ఈ నేపథ్యంలో తుది ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ చేసింది.

ఈ నేపథ్యంలో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఇవాళ నీట్ యూజీ పరీక్ష తుది స్కోరు కార్డుల్ని విడుదల చేసింది. దీని ఆధారంగా త్వరలో కౌన్సిలింగ్, అడ్మిషన్లు జరగబోతున్నాయి. ఇవాళ విడుదల చేసిన నీట్ స్కోరు కార్డుల్ని ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. అలాగే ఈ స్కోరు కార్డుల్ని ఎలా యాక్సెస్ చేయాలన్న వివరాలను కూడా ఎన్టీఏ ప్రకటించింది. దీని ప్రకారం అభ్యర్ధులు ఎన్టీఏ వెబ్ సైట్ లోకి వెళ్లాక ఈ స్టెప్ట్ ను ఫాలో కావాల్సి ఉంటుంది.

NEET UG 2024 Final scorecards released As per Supreme Court ruling

అభ్యర్ధులు నేరుగా ఈ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా స్కోరు కార్డుల్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, అభ్యర్ధి ఈ మెయిల్, మొబైల్ నంబర్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే స్కోర్ కార్డు ఓపెన్ అవుతుంది. దీన్ని ప్రింట్ తీసుకుని కౌన్సిలింగ్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఏడాది మే 5న జరిగిన నీట్ యూజీ పరీక్షలో 13,31,321 మంది మహిళా అభ్యర్థులు, 9,96,393 మంది పురుష అభ్యర్థులు, 17 మంది ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+