నేపాల్ భూకంపం మృత్యుఘోష: 668 మందికి పైగా మృతి
ఖాట్మండ్: నేపాల్ భారీ భూకంపం కుదిపిసేంది. 7.9 తీవ్రతతో తాకిన భూకంపానికి ఖాట్మండులో 668మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఖాట్మండు లోయలో దాని ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. సహాయం అందించాలని భారత్‌ను కోరినట్లు భారతదేశంలోని నేపాల్ రాయబారి దీప్ కె ఉపాధ్యాయ చెప్పారు.
ప్రధాని మోడీ నేపాల్ అధికారులతో మాట్లాడుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. భూకంపం కారణంతో ఖాట్మండ్ విమానాశ్రయాన్ని మూసేశారు. భూకంపం తర్వాత ఖాట్మండులోని ప్రధానమైన సివిల్ ఆస్పత్రికి 36 శవాలు వచ్చినట్లుగా చెబుతున్నారు.

అవసరమైతే సహాయక చర్యలకు దిగడానికి భారత వైమానిక దళాలు సిద్ధంగా ఉన్నాయి. భారత సైన్యాన్ని, బిఆర్ఓ, ఐఎఎఫ్‌లను రక్షణ శాఖ ఆవసరమైతే రంగంలోకి దిగడానికి సిద్ధం చేసింది.
భూకంపం తాకిడికి భారతదేశంలో 11 మంది మరణించారు. బీహారు రాష్ట్రంలో 9 మంది మరణించినట్లు 30 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు మరణించారు.












Click it and Unblock the Notifications