Gujarat Election 2022: రవీంద్ర జడేజా భార్య ట్వీట్‍పై నెటిజన్ల ఆగ్రహం.. ఎందుకంటే..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా ఆల్ రౌండర్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా రివాబా ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మోడీ,అమిత్ షా
ఎన్నికల ప్రచారంలో భాగంగా రివాబా రోడ్ షో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు భారత క్రికెట్ జట్టు జెర్సీని ధరించిన రవీంద్ర జడేజా ఫోటోను ఉపయోగించి ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ట్వీట్ లో ప్రధాని మోడీ,అమిత్ షా ఫోటో, జడేజా ఫొటోతో పాటు రోడ్ షో షెడ్యూల్ ఉంది. అయితే ప్రచారానికి ప్రస్తుతం జట్టులో ఉన్న క్రికెటర్ ఫొటో వాడడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అది తప్పు
"మేడమ్, మీరు రాజకీయాలు చేస్తున్నారు, ఇది మంచి పని, దానితో పాటు మీరు సర్ రవీంద్ర జడేజా ఫోటో కూడా పెట్టారు, ఇది కూడా బాగుంది. కానీ మీరు భారత క్రికెటర్ జెర్సీలో జడేజా ఫోటోను ఉంచారు. అది తప్పు" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. "ఈ జెర్సీని ఎందుకు ఉపయోగించాలి? నేను జడేజాకి పెద్ద అభిమానిని. మీరు ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నాను కానీ ఇది ఆమోదయోగ్యం కాదు. రాజకీయ ప్రచారానికి భారతీయ జెర్సీని ఉపయోగించకూడదు" అని మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.
రెండు దశల్లో
గుజరాత్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 1న, చివరి దశ డిసెంబర్ 5న జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడికానున్నాయి. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications