సీఎంను చెయ్యకపోతే- షిండే పెట్టిన 5 డిమాండ్లు ఇవే: ఎంతటోడైనా తలొంచాల్సిందే !!
New Maharashtra CM: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తోన్నప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేది తేలట్లేదు. ముఖ్యమంత్రి పీఠంపై పీటముడి పడింది. ప్రతిష్ఠంభన కొనసాగుతూనే వస్తోంది. మహారాష్ట్రతో పాటే ఎన్నికలను ఎదుర్కొన్న జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇక్కడ మాత్రం జాప్యం జరుగుతోంది.
నో క్లారిటీ..
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఎలాంటి స్పష్టతా రావాట్లేదు. భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తోంది. వరుసగా రెండోసారి ఏక్‌నాథ్ షిండేకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ శివసేన పట్టుబట్టడం దీనికి ప్రధాన కారణం.

మేజిక్ ఫిగర్‌కు దూరంగా బీజేపీ..
సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 145 సీట్ల సంఖ్యా బలం బీజేపీకి లేదు. 149 సీట్లల్లో పోటీ చేసి 132 చోట్ల గెలిచిందీ పార్టీ. షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ మొత్తం 59 స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు ఈ పార్టీ ఖాతాలో పడ్డాయి.
కలిసివుంటేనే..
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మిత్రపార్టీల మద్దతు తప్పనసరి కావడంతో ముఖ్యమంత్రి పదవి కోసం శివసేన భీష్మించింది. బీజేపీ అధిష్ఠానం మాత్రం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వైపే మొగ్గు చూపుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫా సీఎం పదవి తమ పార్టీకే దక్కాలనే పట్టుదలతో ఉంది బీజేపీ.
అమిత్ షాతో చర్చలు..
ఈ పరిస్థితుల మధ్య బీజేపీ అధిష్ఠానం ముఖ్యమంత్ర అభ్యర్థి ఖరారుపై ఈ ముగ్గురు నేతలు- ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్‌లను ఢిల్లీకి పిలిపించుకుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గురువారం అర్ధరాత్రి వరకూ ఈ చర్చలు సాగాయి.
షిండే అయిదు డిమాండ్లు..
ముఖ్యమంత్రి కుర్చీని వదులుకోవడానికి ఏ మాత్రం కూడా ఏక్‌నాథ్ షిండే సిద్ధంగా లేరు. తప్పదు అనుకుంటే మాత్రం అయిదు డిమాండ్లు అమిత్ షా ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ అయిదింటినీ అంగీకరించగలిగితేనే బీజేపీ అధిష్ఠానం చెప్పినట్టు వింటాననే విషయాన్ని స్పష్టం చేశారని సమాచారం.

మహాయుటి కన్వీనర్‌గా..
1. మహాయుటి కూటమి ప్రభుత్వానికి కన్వీనర్‌గా షిండేను అపాయింట్ చేయడం: దీనికి బీజేపీ సుతారామూ అంగీకరించలేదని చెబుతున్నారు. ఈ పదవిని వదులుకుంటే షిండే మరింత బలపడుతాడనే అభిప్రాయం బీజేపీ పెద్దల్లో నెలకొని ఉందని, అందుకే దీనికి ఒప్పుకోలేదని అంటున్నారు.
2. కొడుకును ఉప ముఖ్యమంత్రిని చెయ్యడం. ఏక్‌నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండే.. ప్రస్తుతం లోక్‌సభ సభ్యుడు. మొన్నటి ఎన్నికల్లో కల్యాణ్ నియోజకవర్గం నుంచి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి విజయదుందుభి మోగించాడు. మూడు లక్షలకు పైగా ఓట్ల తేడాతో శివసేన యూబీటీ అభ్యర్థి వైశాలి దారెకర్- రాణేను మట్టికరిపించారు.
3. మహాయుటి ప్రభుత్వం హోం శాఖను కేటాయించడం: కొత్తగా ఏర్పాటు కాబోయే మహాయుటి ప్రభుత్వంలో హోం మంత్రిత్వ శాఖను షిండే వర్గానికి కేటాయించడం.
4. కేంద్ర మంత్రి పదవి: గతంలో మధ్యప్రదేశ్, హర్యానా ముఖ్యమంత్రులుగా పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్.. ఇప్పుడు కేంద్రమంత్రులు. వారి తరహాలోనే కేంద్ర మంత్రివర్గంలో కీలక పోర్ట్‌ఫోలియోతో కూడిన బెర్త్‌ను ఏక్‌నాథ్ షిండే కోరుకుంటోన్నారు.
5. బీఎంసీ మేయర్ గిరీ- మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకంగా చెప్పుకొనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని శివసేన వర్గానికి కేటాయించడం. బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను దక్కించుకున్నా సరే- మేయర్ పదవిని మాత్రం తమ వర్గానికే దక్కించుకోవడం.. అనే డిమాండ్లు షిండే బీజేపీ అధిష్ఠానం ముందుంచినట్లు చెబుతున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications