వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుండెపోటుతోనే తబ్రేజ్ అన్సారీ మృతి..!! కానీ పుర్రె ఫ్రాక్చర్, ఇతర గాయాలతోనే స్ట్రోక్

|
Google Oneindia TeluguNews

రాంచీ : జై శ్రీరాం, జై హనుమాన్ అనలేదని తబ్రేజ్ అన్సారీపై మూకదాడి చేసిన సంగతి తెలసిందే. హిందు సంస్థల దాడితో తన భర్త చనిపోయారని తబ్రేజ్ భార్య వాదిస్తుండగా .. గుండెపోటుతో చనిపోయారని పోస్టుమార్టం నివేదికలో ఉందని పోలీసులు వెల్లడించారు. దీంతో తబ్రేజ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తాజాగా కొత్త మెడికల్ రిపోర్ట్ కూడా వచ్చింది.

అంతకుముందు ..

అంతకుముందు ..

మూకదాడిలో తబ్రేజ్ అన్సారీ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతని పుర్రెకు ప్రాక్చర్ అయ్యింది. తీవ్రగాయాలతో ఉన్న ఆయనకు గుండెపోటు వచ్చి .. చనిపోయారని మెడికల్ రిపోర్టులో తేలింది. దీనికి సంబంధించి నివేదికను జంషెడ్‌పూర్ ఎంజీఎం మెడికల్ హెచ్‌వోడీలు ఐదుగురు ధ్రువపరుస్తూ మెడికల్ రిపోర్ట్ అందజేశారు. అన్సారీ గుండెపోటుతోనే చనిపోయారని .. కానీ దానికి అతను తీవ్రగాయాలతో ఉండటమే కారణమని పేర్కొన్నారు. గుండెపోటుతో పాటు పుర్రె కూడా ప్రాక్చర్ అయ్యిందని, శరీరంలోని మిగతా అవయవాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

విచక్షణరహితంగా ..

విచక్షణరహితంగా ..

జూన్ 17న జార్ఖండ్‌లోని సరైకెల ఖార్సావన్ జిల్లాలో అతివాద గ్రూపు సభ్యులు అన్సారీని అడ్డుకొన్నారు. జై శ్రీరాం అని దాడికి తెగబడ్డారు. దీంతో అతను తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే అన్సారీ గుండెపోటుతో చనిపోయారని వైద్యులు నివేదిక ఇవ్వడంపై ఆయన భార్య తప్పుపట్టారు. తన భర్తపై కొందరు దాడిచేయడంతోనే మృతిచెందారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఐదుగురు విభాగ అధిపతుల మరోసారి అన్సారీ మృతికి సంబంధించి వైద్య పరీక్షను విడుదల చేశారు. జూన్ 17న అన్సారీ చనిపోగా .. కొత్త మెడికల్ సర్టిఫికెట్ గత నెల 6న వైద్యులు విడుదల చేశారు.

ఈ విషయం తెలిసి కుప్పకూలిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్..ఈ విషయం తెలిసి కుప్పకూలిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్..

పుర్రె ప్రాక్చర్ ..

పుర్రె ప్రాక్చర్ ..

పుర్రెకు ప్రాక్చర్ కావడంతో మెదడులో రక్తం కారిందని వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు పుర్రె కింద రక్తం గడ్డకట్టిందని వివరించారు. అన్సారీ పుర్రెకు తీవ్రమైన గాయలయ్యాయని సీనియర్ న్యూరాలజిస్ట్ ఒకరు మీడియాకు పేర్కొన్నారు. పుర్రె ప్రాక్చర్ కావడం అనేది మైనస్ అని తెలిపారు. దీంతోపాటు అన్సారీ విష పదార్థం తీసుకున్నారని మెడికల్ రిపోర్టులో వెల్లడించడం అనుమనాలకు తావిస్తోంది. అయితే దాడికి గురైన తర్వాత ఆస్పత్రిలో చేరడంలో చూపిన నిర్లక్ష్యమే అతని ప్రాణాలను బలిగొంది. దాడి తర్వాత వైద్యులను కలిసిన అన్సారీ .. తన కాలుకు మాత్రమే దెబ్బ తగిలిందని చెప్పారు. మిగతా చోట్ల గాయాలు కాలేదని చెప్పి .. దెబ్బలను దాచి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.

ఒత్తిడికి గురై ..

ఒత్తిడికి గురై ..

తలపై దెబ్బ తగలడంతో మనిషి ఒత్తిడికి గురవుతుంటారు. దెబ్బ తగలినా ట్రీట్ మెంట్ చేయించుకోకపోవడం అన్సారీ చేసిన తప్పయింది. పుర్రెకు గాయమైతే ఊపిరితిత్తులు, గుండెపై ఆ ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్తున్నారు. శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా .. గుండె, ఊపిరితిత్తులపై ప్రభావం తప్పనిసరి చూపిస్తోందని డాక్టర్ మర్ది పేర్కొన్నారు. మూకదాడిలో అన్సారీ చనిపోతే పోలీసులు మాత్రం గుండెపోటుతో చనిపోయారని పేర్కొన్నారు. దీంతో 11 మందిపై హత్య కేసులను వెనక్కి తీసుకొని తమ స్వామిభక్తిని ప్రదర్శించారు. కానీ దాడితోనే తన భర్త చనిపోయారని స్పష్టంచేశారు. దీంతో మరోసారి వైద్యులు రిపోర్ట్ ఇచ్చినా .. గుండెపోటుతోనే చనిపోయారని కానీ .. దాడితో గాయాలతో మృతిచెందారని చెప్పడం ఆమె ఆరోపణలకు బలం చేకూరింది.

English summary
new medical report on the death of lynching victim Tabrez Ansari has cast a shadow on the claim that he died due to a cardiac arrest. A document signed by five HoDs of the MGM Medical College in Jamshedpur suggests that while Tabrez Ansari did eventually die of a cardiac arrest, the heart attack was the result of severe injuries. According to the report, Tabrez's cardiac arrest was induced by a combination of a skull fracture, pale organs and filling up of blood in his heart chambers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X