వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్: హెచ్ 1 బీ వీసాను ఇండియన్స్ దుర్వినియోగం, వీసా ఫీజు పెంపు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇమ్మిగ్రేషన్ విధానాలపై భారతీయ కంపెనీలు, ఉద్యోగులను లక్ష్యంగా అమెరికా చేసుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. భారత అవుట్‌సోర్సింగ్ కంపెనీలు ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు విరుద్దంగా అక్రమ వలస పద్దతులను అనుసరిస్తున్నాయని ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నికైన తర్వాత హెచ్ 1 బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఈ నిబంధనలు కఠినతరం చేయడంతో ప్రధానంగా ఇండియన్ టెక్ కంపెనీలకు ఇబ్బందిగా మారింది.

స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ రకమైన నిర్ణయాలను తీసుకొంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందుకుగాను ట్రంప్ సర్కార్ వీసా నిబంధనలను తీసుకువచ్చింది.

ఈ కొత్త విధానాల కారణంగా ఇండియన్ టెక్ కంపెనీలు కూడ అమెరికాలో ఉంటున్నవారికే ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం మినహ ఇతర టెక్ కంపెనీలకు ప్రత్యామ్నాయాలు కన్పించడం లేదు.

అక్రమ వలస పద్దతులు అనుసరిస్తున్నారు

అక్రమ వలస పద్దతులు అనుసరిస్తున్నారు

ఇమ్మిగ్రేషన్ విధానాలపై అమెరికాలో ఇటీవల జరిగిన సమీక్షలో భారతీయ టెక్ కంపెనీలు, టెక్కీలను టార్గెట్ చేశారు. భారత అవుట్ సోర్సింగ్ కంపెనీలు ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు విరుద్దంగా అక్రమ వలస పద్దతులను అనుసరిస్తున్నాయని ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. దీంతో ఇండియాకు చెందిన టెక్ కంపెనీలు, టెక్కీలు ఆత్మరక్షణలో పడ్డారు.

Recommended Video

Good News for Techies Find Out More - Oneindia Telugu
హెచ్1 బీ వీసాదారులకు వేతనాలపై చర్చ

హెచ్1 బీ వీసాదారులకు వేతనాలపై చర్చ

హెచ్1 బీ వీసా ద్వారా అమెరికాలో పనిచేసే ఉద్యోగులకు ఏ మేరకు చెల్లిస్తున్నారు, వేతన వ్యత్యాసాలపై కొందరు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ సమావేశంలో ప్రధానంగా ఇండియాకు చెందిన టెక్ కంపెనీలు, టెక్కీలే లక్ష్యంగా సాగించని సమాచారం. దీంతో రానున్న రోజుల్లో హెచ్ 1 బీ వీసాల విషయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు

నైపుణ్యాలు లేవు

నైపుణ్యాలు లేవు

హెచ్ 1 బీ వీసాలు ధరఖాస్తు చేసుకొంటున్న వారిలో చాలా మందికి అవసరమైన నైపుణ్యాలు లేవని హెచ్ 1 బీ , ఎల్ 1 వర్కర్లను ఇంటర్వ్యూ చేసే అధికారి ఒకరు ఈ సమావేశంలోనే ప్రకటించడంతో మరింత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

వీసా ఫీజును భారీగా పెంచే అవకాశం

వీసా ఫీజును భారీగా పెంచే అవకాశం

హెచ్1 బీ వీసాలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకుగాను వీసా ఫీజును భారీగా పెంచాలనే ప్రతిపాదన కూడ ఈ సమావేశంలో వచ్చింది. అయితే ఇమ్మిగ్రేషన్ విధానాలపై నిర్వహించిన ఈ సమావేశ వివరాలు బయటకు రావడం పట్ల అమెరికా అధికారుల్లో ఆందోళన నెలకొంది.

English summary
Pent up anger against outsourcing, the H-1B visa programme and Indian technology workers spilled over during a recent review call organised by a top US agency responsible for overseeing lawful immigration to the United States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X