girlfriend: గిఫ్ట్ ఇవ్వడానికి నేరుగా ప్రియురాలు ఇంటికే వెళ్లాడు, మ్యాటర్ రివర్స్ ? వీడియో !
లక్నో/బలరామ్ పూర్: దేశవ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలను వైభవంగా జరుపుకుంటారు. అందరూ సంతోషంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఇలా న్యూ ఇయర్ లో సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చి ఆమెను సంతోషపెట్టేందుకు వచ్చిన వ్యక్తికి గ్రామస్తులు షాక్ ఇచ్చారు. అతడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదేశారు. ప్రియుడిని గ్రామస్తులు చితకబాదుతున్నన సమయంలో తీసిన ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో అది వైరల్ అయ్యింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేశారు.
Doctor: ముగ్గురు భార్యలు, 60 మంది పిల్లలు, ఐదు క్రికెట్ టీమ్ లు రెడీ చేసి నాలుగో భార్య?, ఆపరారేయ్ !

లవర్ బాయ్
ఉత్తరప్రదేశ్ లోని బలరామ్ పూర్ లో సోనూ గుప్తా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బలరామ్ పూర్ జిల్లాలోని భార్గవ్ నగర్ లో సోనూ గుప్తా ప్రియురాలు నివాసం ఉంటున్నది. న్యూ ఇయర్ రోజున తన గర్ల ఫ్రెండ్ ను కలవాలని సోనూ గుప్తా నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ గిఫ్ట్ కూడా కొనుగోలు చేశాడు. తానే స్వయంగా బహుమతిని నేరుగా ప్రియురాలికి ఇవ్వాలని అనుకున్న సోనూ నేరుగా భార్గవ నగర్ కు వెళ్లాడు.

థ్రిల్ ఇవ్వాలని అనుకున్నాడు.... అయితే ?
ప్రేయసికి సర్ ప్రైజ్ ఇవ్వడానికి బయలుదేరిన సోనూ కనీసం తాను వస్తున్నానని ఆమెకు చెప్పలేదు. ప్రియురాలు నివాసం ఉంటున్న ఏరియాకు వెళ్లిన సోనూ గుప్తాకు ఆమె ఇల్లు అంత తేలికగా కనిపించలేదు. ప్రియురాలు పేరు చెప్పిన సోనూ ఆమె ఇల్లు ఎక్కడా అంటూ స్థానికులు అడిగాడు. వీడు ఎవడో మన ఏరియా అమ్మాయి కోసం ఎగేసుకుంటూ వచ్చాడని, చేతిలో గిఫ్ట్ కూడా పెట్టుకున్నాడని స్థానిక యువకులు రగిలిపోయారు.

ప్రియుడిని మామూలుగా కొట్టలేదు... అంతే
!
గిఫ్ట్ ప్యాక్ తో ప్రియురాలి ఇంటికి వెళ్లి అడ్రస్ అడిగిన సోను గుప్తా గ్రామస్తుల చేతికి చిక్కిపోయాడు. మా ఊరికి వచ్చి, మా ఊరి అమ్మాయి ఇల్లు ఎక్కడా అని అడ్రస్ అడుగుతావా అంటూ రెచ్చిపోయిన గ్రామస్తులు కొందరు గుమిగూడి సోనూ గుప్తాను పట్టుకుని చితకబాదేశారు. సోనూ కాలర్ పట్టుకుని ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు? అంటూ తరిమి తరిమి కొట్టారు. చివరికి ప్రియురాలిని కలవడానికి బహుమతి ఇచ్చేందుకు వచ్చానని సోను గుప్తా వాపోయాడు.

వీడియో వైరల్ కావడంతో మ్యాటర్ లీక్
సోను లవ్ చేస్తున్నానని చెప్పడంతో గ్రామంలోని యువకులు మరింత రెచ్చిపోయి సోను గుప్తాను స్తంభానికి కట్టేసి చితకబాదేశారు.
ఆ సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గాయపడిన సోను గుప్తా స్థానికులకు క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులు సోనూ అడ్రస్ తెలుసుకుని అతన్ని విచారణ చేశారు. బాధితుడు సోనూ గుప్తాను జరిగిన విషయం మొత్తం పోలీసులకు చెప్పాడు. పోలీసులు 15 మందిపై కేసు నమోదు చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications