Doctor: ముగ్గురు భార్యలు, 60 మంది పిల్లలు, ఐదు క్రికెట్ టీమ్ లు రెడీ చేసి నాలుగో భార్య?, ఆపరారేయ్ !

ఇస్లామాబాద్/పాకిస్థాన్: ఒక భార్యతో కాపురం చేసి ఇద్దరు, ముగ్గురు పిల్లలను కని వారిని పెంచి పోషించడం సామాన్య ప్రజలకు, మధ్యతరగతి వారికి కొంచెం కష్టంగానే ఉంటుందని మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. కొందరు ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకుని నలుగురు, లేదా ఐదు మంది పిల్లలకు తండ్రి అవుతున్నారు. అయితే ఇక్కడ ఓ పోటుగాడు ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు భార్యలతో కలిసి ఒకే ఇంటిలో కాపురం ఉంటున్నాడు. అంతవరకు బాగానే ఉన్న ముగ్గురు భార్యలతో కాపురం చేసిన మహానుభావుడు ఏకంగా 60 మంది కుమార్తెలు, కుమారులకు తండ్రి అయ్యాడు. ఇప్పుడే లేటేస్ట్ గా ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు. మాకు ఇక ఓపిక లేదని ముగ్గురు భార్యలు చెప్పినట్లు ఉన్నారు. ఇప్పుడు రూట్ మార్చిన మనోడు నాలుగో పెళ్లి చేసుకుని ఇంకా కొంత మందికి తండ్రి కావాలని ఆశపడుతున్నాడు.
మనోడి పిల్లలతో ఐదు క్రికెట్ టీమ్ లు రెడీ చేసినా ఇంకా మిగిలిపోతారు.

50 ఏళ్లకే 60 మంది పిల్లలు

పాకిస్థాన్ లోని క్వేట్టా నగరంలలో సర్దార్ జాన్ మహమ్మద్ ఖాన్ ఖిల్జీ అలియాస్ జాన్ మోహమ్మద్ అలియాస్ ఖిల్జీ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మోహమ్మద్ ఖాన్ ఖిల్జీ ఇప్పుడు 60వ సారి తండ్రి అయ్యాడు. ముగ్గురు భార్యలతో కాపురం చేసిన మోహమ్మద్ ఖాన్ ఖిల్జీ భవిష్యత్తులో మరింత మంది పిల్లలను కనాలనే ఆశతో ఉన్నానని చెప్పాడు. ఇటీవల మోహమ్మద్ ఖాన్ ఖిల్జీ మగ బిడ్డకు తండ్రి అయ్యి అతనికి హాజీ ఖుషల్ ఖాన్‌ అనే నామకరణం చేశాడు.

డాక్టర్ కు ఓపిక ఎక్కువ

డాక్టర్ కు ఓపిక ఎక్కువ

పాకిస్థాన్ లోని క్వెట్టా నగరంలోని ఈస్టర్న్ బైపాస్ సమీపంలో నివసించే మోహమ్మద్ ఖాన్ ఖిల్జీ వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఇప్పటికే మోహమ్మద్ ఖాన్ ఖిల్జీ ముగ్గురు మహిళలను వివాహం చేసుకున్నాడు. పాకిస్థాన్ లో అతి పెద్ద ఫ్యామిలీగా మోహమ్మద్ ఖాన్ ఖిల్జీ ఫేమస్ అయిపోయాడు. పలువురికి వైద్యం చేస్తున్న డాక్టర్ మోహమ్మద్ ఖాన్ ఖిల్జీ అతని కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

 60 మంది పిల్లలతో ఆశ తీరలేదని నాలుగో పెళ్లి కోసం ?

60 మంది పిల్లలతో ఆశ తీరలేదని నాలుగో పెళ్లి కోసం ?


మోహహమ్మద్ ఖాన్ ఖిల్జీ తాను 60వ సారి తండ్రి అయ్యానని ఉప్పొంగిపోతున్నాడు, తాను మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నానని, మంచి అమ్మాయి ఉంటే చూసి పెట్టాలని ఫ్రెండ్స్ కు చెప్పిన మహానుభావుడు నాలుగో వివాహం చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని, నాకు సహాయం చేయమని నేను నా స్నేహితులందరికీ చెప్పానని మోహమ్మద్ ఖాన్ ఖిల్జీ చెప్పాడని బీబీసీ న్యూస్ కథనం ప్రసారం చేసింది.

కొడుకుల కంటే కూతుర్లు ఎక్కువ మంది

కొడుకుల కంటే కూతుర్లు ఎక్కువ మంది

మాకు ఇక ఓపిక లేదని ముగ్గురు భార్యలు చెప్పినట్లు ఉన్నారు. ఇప్పుడు రూట్ మార్చిన మనోడు నాలుగో పెళ్లి చేసుకుని ఇంకా కొంత మందికి తండ్రి కావాలని ఆశపడుతున్నాడు. కొత్తగా పెళ్లి చేసుకునే భాగస్వామితో ఎక్కువ మంది పిల్లలను కనాలని ఎదురు చూస్తున్నానని మోహమ్మద్ ఖాన్ ఖిల్జీ మీడియాకు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఖల్జీకి కొడుకుల కంటే ఎక్కువ మంది కుమార్తెలు ఉన్నారు.

డాక్టర్ కు ఆర్థిక ఇబ్బందులు

డాక్టర్ కు ఆర్థిక ఇబ్బందులు

భారీ కుటుంబం అయినప్పటికి కుటుంబం మొత్తం ఒకే ఇంటి ఉండాలని మోహమ్మద్ ఖల్జీ ఆశపడ్డాడు. అయితే పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం స్థాయి పెరుగుదల దెబ్బతో డాక్టర్ మోహమ్మద్ ఖాన్ ఖిల్జీ మీద ఆర్థికంగా ప్రభావ చూపించింది. మోహమ్మద్ ఖాన్ ఖిల్జీ వ్యాపారం స్తంభించిపోయింది. పిండి, నెయ్యి, పంచదారతో సహా నిత్యవసర వస్తువుల ధరలు మూడు రెట్లు పెరిగిపోవడంతో మోహమ్మద్ ఖాన్ ఖిల్జీ ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నాడని స్వయంగా అతనే మీడియాకు చెప్పాడు.

సార్ కొంచెం కూడా వెనక్కి తగ్గడం లేదు

సార్ కొంచెం కూడా వెనక్కి తగ్గడం లేదు

గత మూడు సంవత్సరాలుగా నాతో సహా పాకిస్థానీలు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మోహమ్మద్ ఖాన్ ఖిల్జీ చెప్పాడు.
అయినప్పటికీ దృఢ నిశ్చయంతో నాలుగో పెళ్లి చేసుకుని మరింత మంది పిల్లలను కనాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు. ముగ్గురు భార్యలు, 60 మంది పిల్లల ఖర్చులు తీర్చడానికి సాధ్యమైనదంత నేనే చేస్తున్నానని, తరువాత ఆ భగవంతుడు ఉన్నాడని మోహమ్మద్ ఖాన్ ఖిల్జీ వేదాంతం మాట్లాడుతున్నాడు.

 తిరిగేదానికి ఫ్యామిలీకి బస్సు కావాలంటా.... ప్రభుత్వానికి దిక్కులేదు

తిరిగేదానికి ఫ్యామిలీకి బస్సు కావాలంటా.... ప్రభుత్వానికి దిక్కులేదు


తన కుటుంబంతో హాయిగా విహారయాత్రలకు తిరగాలని ఆశగా ఉందని మోహమ్మద్ ఖాన్ ఖిల్జీ అంటున్నాడు. అయితే విహారయాత్రకు వెళ్లాలంటే చాలా వాహనాలు అవసరం అవుతాయని, పాకిస్థాన్ ప్రభుత్బం బస్సు ఇస్తే హ్యాపీగా అందరూ ఒకే వాహనంలో పాకిస్థాన్ మొత్తం తిరిగేస్తామని కలలు కంటున్న మోహమ్మద్ ఖాన్ ఖిల్జీ మనసులోని మాట చెప్పాడు. అయితే పాకిస్థాన్ ప్రభుత్వానికి నిధులు లేక అల్లాడుతంటే వీడి ఫ్యామిలీకి బస్సు అవసరమా అంటూ ఆదేశంలో కొందరు జోకులు వేసుకుంటున్నారని తెలిసింది.

 ఐదు క్రికెట్ టీమ్ లు రెడీ చేసినా ఇంకా మిగిలిపోతారు

ఐదు క్రికెట్ టీమ్ లు రెడీ చేసినా ఇంకా మిగిలిపోతారు

డాక్టర్ మోహమ్మద్ ఖాన్ ఖిల్జీ పిల్లలతో ఐదు క్రికెట్ టీమ్ లు రెడీ చేసినా ఇంకా ఐదు మంది మిగిలిపోతారు. ఆరు క్రికెట్ టీమ్ రెడీ చెయ్యాలని అనుకుంటున్నాడో ఏమో ? నాలుగో పెళ్లి చేసుకోవాలని ఖిల్జీ తహతహలాడుతున్నాడు. ఆపరారేయ్ అని బంధువులు అంటున్నా డాక్టర్ మాత్రం ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+