మహిళా ఎంపీ నగ్న ఫొటోలు వైరల్..ఆమె స్వయంగా అందరికి చూపిస్తోంది..!

టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేదా..టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ అభివృద్దికి ఎంత దోహదపడుతుందో తెలియదు కానీ.. తప్పు దోవ పడుతుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. టెక్నాలజీ రంగంలో ప్రపంచం దూసుకుపోతున్న వేళ, డీప్‌ఫేక్ టెక్నాలజీ ఒక పెను సవాలుగా మారింది. దీని దుర్వినియోగానికి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులే కాదు, సామాన్యులు కూడా బలవుతున్నారు. సోషల్ మీడియాలోని ఫొటోలను డీప్‌ఫేక్ టెక్నాలజీతో అనుసంధానించి అసభ్యకర చిత్రాలను సృష్టిస్తూ, వాటిని వైరల్ చేయడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ సమస్య తీవ్రతను ప్రపంచానికి తెలియజేయడానికి, న్యూజిలాండ్ మహిళా ఎంపీ లారా మక్‌లూర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఏఐ-జనరేటెడ్ డీప్‌ఫేక్ నగ్న ఫొటోను ఏకంగా పార్లమెంట్‌లోనే ప్రదర్శించారు. కేవలం ఐదు నిమిషాల్లో ఈ డీప్‌ఫేక్ ఫొటోను తయారు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఈ ఘటన న్యూజిలాండ్‌లో హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా, డీప్‌ఫేక్ సమస్య ఎంత జటిలమైందో ప్రపంచానికి కళ్ళకు కట్టినట్లు చూపింది.

New Zealand female MP Laura McClure sensational decision

ఇలాంటి వాటి వల్ల సమాజానికి ఎంతో నష్టం జరుగుతోందని, డీప్‌ఫేక్‌ను నేరంగా పరిగణించే బిల్లును తేవడం ఎంతో ముఖ్యమని లారా మక్‌లూర్ పార్లమెంట్ దృష్టికి తీసుకువచ్చారు. నగ్న చిత్రాల సమస్య ఒక్క న్యూజిలాండ్‌ది కాదని, యావత్ ప్రపంచం ప్రస్తుతం ఈ బాధితుల్లో ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది, డీప్‌ఫేక్ నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+