శోభనం మధ్యలో నవ వరుడు జంప్..!

మూడు ముళ్లు బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వేడుకే వివాహం. అందుకే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ ప్రస్తుతం సమాజంలో చూస్తే లవ్ మ్యారేజ్ అంటే అమ్మాయి ఫ్యామిలీ చంపేస్తుంది.. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే భార్య చంపేస్తుంది.. పెళ్లి చేసుకోకపోతే ఇంట్లో వాళ్లు చంపేస్తారు.. అంటూ ఇది సగటు యువకుల మీద సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవ్వడం చూసే ఉంటాం. అంతే కాకుండా ప్రేమ విషయంలో, పెళ్లి తర్వాత గొడవల కారణంగా.. వేరే వ్యక్తితో సంబంధం కారణంగా తమ భాగస్వామిని హత్య చేస్తున్న ఘటనలను చూస్తూనే ఉంటున్నాం. ఇవన్నీ పక్కన పెడితే ప్రేమ వివాహం లేదా పెద్దలు కుదిర్చిన వివాహం అయిన కానీ చేసుకొని హ్యాప్పీగా ఉంటున్న వారు కూడా ఉన్నారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే ఘటన మాత్రం అందరికీ షాక్ ఇస్తూనే మరోవైపు నవ్వులు పూయిస్తుంది. నవవరుడు తన 'శోభనం' మధ్యలోనే అదృశ్యమయ్యాడు. అయితే అతను చనిపోయాడని భావించినా బ్రతికే ఉన్నానని.. సురక్షితంగానే ఉన్నానని తెలిపాడు. కానీ అలా బయటికి వెళ్లిపోవడానికి కారణం మాత్రం ఊహించనిది కావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరగగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

newlywed-man-went-away-from-first-night-at-uttar-pradesh-and-news-got-viral

అసలేం జరిగిందంటే..

స్థానిక ముజఫర్‌ నగర్‌లో ఐదు రోజుల క్రితం మొహసిన్‌ అనే యువకుడికి ఒక యువతితో వివాహం జరిగింది. అదే రోజూ రాత్రి పెద్దలు వారికి శోభనం ఏర్పాటు చేశారు. అయితే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసిన గదిలో లైట్లు ప్రకాశవంతంగా ఉన్నాయని.. చిన్న బల్బు తీసుకురమ్మని భార్య కోరింది. దాంతో వెంటనే బయటకెళ్లిన అతను తిరిగి రాలేదు. ఈ క్రమలోనే తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. చివరిగా గంగా కాలువ సమీపంలో తిరిగినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆత్మహత్య చేసుకున్నాడేమోనన్న అనుమానంతో డైవర్లతో నీటిలో వెతికించినా అతని ఆచూకీ లభించలేదు.

కాగా ఆ మరుసటి రోజున అతని ఇద్దరు సోదరీల వివాహం ఉంది. ఆ కార్యక్రమానికి సైతం మొహసిన్ రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులతో పాటు.. నవ వధువు ఫ్యామిలీ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా మోహసిన్ వారి బంధువుల్లో ఒకరికి ఫోన్ చేసి తాను హరిద్వార్‌లో ఉన్నట్లు చెప్పాడు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో హరిద్వార్ వెళ్లి అతడిని సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు. విచారణలో "తన భార్య ముందు భయపడి.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని మొహసిన్ వెల్లడించడంతో అందరూ షాక్ అయ్యారు. అతని ఇంటి సభ్యులే కాకుండా స్థానికులు సైతం తెగ నవ్వుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+