బెంగళూరు బాంబు పేలుడు: కేసులో పురోగతి, నిందితుడి ఆచూకీ లభ్యం...?
బెంగుళూరు: బెంగుళూరు చర్చ్ స్ట్రీట్ బాంబు పేలుడు కేసులో పురోగతి కనిపించింది. ఈ పేలుడు వెనుక సిమి ఉగ్రవాది మోహబూబ్ అలియాస్ బుడ్డ హస్తం ఉందని బెంగుళూరు పోలీసులు అనుమానిస్తున్నారు.
బాంబు పేలుడు ఘటన అనుమానితుల్లో ఒకడైన మహబూబ్ అలియాస్ బుడ్డ యాదగిరి పట్టణంలో బట్టల వ్యాపారం పేరుతో రెండు నెలల కిందట అక్కడి రాజీవ్ గాంధీ నగర్‌లో ఓ అద్దె ఇంట్లో మకాం వేసినట్లు సమాచారం. భావిస్తున్నారు. శరణప్ప అనే వ్యక్తి గుర్తింపు కార్డు ఆధారంగా, అతడు ఎయిర్‌టెల్ సిమ్ కార్డు ఉపయోగించి పలు కాల్స్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

బుధవారం యాదగిరిలో శరణప్పను నిర్బంధంలోకి తీసుకుని విచారించారు. తనకు బుడ్డకు ఏవిధమైన సంబంధం లేదని శరణప్ప పోలీసులకు బదులిచ్చాడని తెలుస్తోంది. బాంబుల్ని రెండు తెలుగు దినపత్రికల్లో చుట్టి ఉండటం గుర్తించిన పోలీసులు బెంగుళూరు, హోసూరు పట్టణాల్లో ఆ పత్రిక అమ్మేవారిని విచారిస్తున్నారు.
అనుమానితులు ఉన్న ఐదారుగురి ఛాయా చిత్రాల్ని చూపించి వారిలో ఎవరికైనా పత్రికను అమ్మారేమోనని వాకబు చేస్తున్నారు. యాదగిరి జిల్లా కేంద్రానికి చేరుకున్న పోలీసు బృందాలు మెహబూబ్ అలియాస్ బుడ్డ పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. అధికారికంగా పోలీసులు దీనిపై స్పందించడం లేదు.












Click it and Unblock the Notifications