బీటెక్ చదివి బాంబులు పేల్చుతున్నారు, తుంగా తీరంలో ట్రయల్ బాంబు, ఉగ్రవాదానికి విదేశీ డబ్బు !

బీటెక్ చదివి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించాలని ప్రయత్నించిన ఇద్దరి మీద ఎన్ఐఏ అధికారులు చార్జ్ చీట్ దాఖలు చేశారు.

బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్న సమయంలో ఎన్ఐఏ అధికారులు కొన్ని కేసుల దర్యాప్తు వేగవంతం చేశారు. బీటెక్ చదివి ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించాలని ప్రయత్నించిన ఇద్దరి మీద ఎన్ఐఏ అధికారులు చార్జ్ చీట్ దాఖలు చేశారు. యువకుడిని కత్తులతో పొడిచిన తరువాత ఆ ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల అసవ బండారం బయటకు వచ్చింది.

ఆగస్టు 26, 2022వ తేదీన శివమొగ్గలోని తుంగా నది ఒడ్డున జరిగిన ట్రయల్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులపై ఎన్ఐఏ అధికారులు ( NIA) ఛార్జ్ షీట్‌ను సమర్పించింది. మజ్ మునీర్ అహ్మద్, సయ్యద్ యాసిన్‌లపై ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ అధికారులు ఛార్జిషీటు సమర్పించారు. నిందితులు కర్ణాటకలో (Bengaluru) రాష్ట్రంలో ఐసిస్ కార్యకలాపాలను విస్తరించడానికి, రాష్ట్రంలో విధ్వంసం, హింసాత్మక చర్యలను నిర్వహించడానికి కుట్ర పన్నారని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

NIA officials have filed a charge sheet in a special court against two B.Tech youths who tried to prepare terrorists.
బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన మజ్ మనీర్, సయ్యద్ యాసిన్ లు 2022 ఆగస్టు 15వ తేదీన శివమొగ్గ నగరంలో ప్రేమ్ సింగ్‌ అనే యువకుడినిను కత్తులతో పొడిచారు. అంతే కాకుండా శివమొగ్గలోని పలు ప్రాంతాల్లోని గోదాములు, మద్యం దుకాణాలు, హార్డ్‌వేర్ షాపులు, వాహనాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసేందుకు నిదితులు ఇద్దరు ప్లాన్ చేశారని ఎన్ఐ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

తుంగా నది తీరంలో ఐఈడీని పేల్చారు. ఈ సమయంలో నిందితులు భారత జాతీయ జెండాను దహనం చేశారు. అంతేకాకుండా జాతీయ జెండాను తగులబెడుతున్న సమయంలో వీడియో రికార్డ్ చేశారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అధికారుల విచారణలో విదేశాల నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో నిందితులకు డబ్బు వచ్చినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. మాజ్ అతని స్నేహితుల ఖాతాల్లోకి రూ. 1.5 లక్షల క్రిప్టో కరెన్సీని అందుకున్నారు. సయ్యద్ యాసిన్ అతని స్నేహితుడి ఖాతాలో 62 వేల డబ్బు జమ అయ్యిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

NIA officials have filed a charge sheet in a special court against two B.Tech youths who tried to prepare terrorists.

షారిక్ మంగళూరు సిటీలో బాంబు పేలుడుకు ప్లాన్ చేశాడు. నవంబర్ 19వ తేదీ ( 2022)న మంగళూరులోని కద్రి ఆలయం సమీపంలో ఐఈడీ పేలుడుకు ప్లాన్ చేశాడు, అయితే దారిలో టైమర్ సరిగా పనిచేయకపోవడంతో ఆటోనే కుక్కర్ బాంబుకు ఏర్పాటు చేసిన ఐఈడీ పేలింది. ఈ కేసులో ఆరుగురు నిందితులపై ఎన్ఐఏ విచారణ కొనసాగిస్తోంది. మొత్తం మీద కర్ణాటకలో ఉగ్రవాదులు చాపకింద నీరులా వారి కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారని ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+