మన దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు.. గంటకు 9 కి.మీ. వేగం

మనం ఎప్పుడైనా గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే రైళ్ల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ, ఒక రైలు కేవలం గంటకు 9 కిలోమీటర్ల వేగంతో, అచ్చం నత్తనడకన నడుస్తుందంటే మీరు నమ్ముతారా? అంత నెమ్మదిగా వెళ్లినా సరే, ఆ రైలు ప్రయాణం కోసం దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కేవలం 46 కిలోమీటర్ల దూరానికి ఏకంగా 5 గంటల సమయం తీసుకునే ఆ అద్భుతమైన నత్త రైలు మరెదో కాదు.. తమిళనాడులోని మెట్టుపాళ్యం నుంచి కునూర్ మీదుగా ఊటీ వెళ్లే 'నీలగిరి మౌంటెన్ రైల్వే'.

ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి

ఎప్పటికీ మరువలేని బాలీవుడ్ క్లాసిక్ సాంగ్ 'దిల్ సే' చిత్రంలోని 'ఛయ్య ఛయ్య' పాటను ఎవరూ మరచిపోలేరు. షారుక్ ఖాన్, మలైకా అరోరా నర్తించిన ఆ అద్భుతమైన పాటను చిత్రీకరించింది సరిగ్గా ఈ రైలు పైనే కావడం విశేషం. పొగమంచు కప్పుకున్న పర్వత శ్రేణులు, దట్టమైన అడవులు, సుదీర్ఘమైన తేయాకు తోటలు, చీకటి సొరంగాల గుండా సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు జీవితంలో ఎప్పటికీ మరువలేని మధురమైన అనుభూతిని ఇస్తుంది. ఈ రైలు మార్గం ఆసియా ఖండంలోనే అతి నిటారైన మీటర్ గేజ్ రైల్వే ట్రాక్‌లలో ఒకటి. కొండ ఎక్కేటప్పుడు రైలు వెనక్కి జారిపోకుండా ఉండటానికి పట్టాల మధ్యలో 'రాక్ అండ్ పినియన్' అనే ప్రత్యేకమైన పళ్ల బాటను ఉపయోగిస్తారు. భారతదేశంలో ఈ సాంకేతికత ఉన్న ఏకైక రైలు మార్గం ఇదే. అంతేకాకుండా, మెట్టుపాళ్యం నుంచి కొండ ఎక్కేటప్పుడు ఇంజిన్‌ను బోగీల వెనుక భాగంలో ఉంచి పైకి నెడతారు. మెట్టుపాళ్యం నుంచి కునూర్ వరకు హెరిటేజ్ ఆవిరి ఇంజిన్‌తో, అక్కడి నుంచి ఊటీ వరకు డీజిల్ ఇంజిన్‌తో ఈ రైలు ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చుతుంది.

 విజయవాడ మార్గంలో ఈ తేదీల్లో ఈ ప్రధాన రైళ్ల దారి మళ్లింపు, బోర్డింగ్ మార్చుకోండి..!!
విజయవాడ మార్గంలో ఈ తేదీల్లో ఈ ప్రధాన రైళ్ల దారి మళ్లింపు, బోర్డింగ్ మార్చుకోండి..!!
Nilgiri Railway The slowest-moving train in our country with a speed of 9 km per hour

సొరంగాలు, వంతెనలు, చారిత్రక కట్టడాలపై ప్రయాణం

ఈ అద్భుతమైన ప్రయాణంలో రైలు 16 చీకటి సొరంగాలు, 208 క్లిష్టమైన మలుపులు, 32 భారీ వంతెనలతో సహా సుమారు 250 చారిత్రక వంతెనల గుండా సాగుతుంది. మెట్టుపాళ్యం వద్ద సముద్ర మట్టానికి 1069 అడుగుల ఎత్తులో ప్రారంభమయ్యే ఈ ప్రయాణం.. కల్లార్, అడ్డర్లీ, రన్నిమేడ్, కాట్రే, కునూర్, వెల్లింగ్టన్, లవ్‌డేల్, ఫెర్న్‌హిల్ మీదుగా సముద్ర మట్టానికి 7,228 అడుగుల ఎత్తులో ఉన్న ఊటీకి చేరుకుంటుంది. ప్రయాణ వేగం చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రశాంతంగా ప్రకృతి అందాలను, జలపాతాలను మనసారా వీక్షించే అవకాశం లభిస్తుంది. మెట్టుపాళ్యం నుంచి ఊటీ బయలుదేరే ఈ రైలు ప్రయాణంలో కేవలం అడవులే కాకుండా ఎన్నో సుందరమైన చిన్న స్టేషన్లు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ స్టేషన్ల చుట్టూ ఉండే పైన్, యూకలిప్టస్ చెట్లు, దట్టమైన పొగమంచు తెరలు పర్యాటకులకు సరికొత్త లోకంలో విహరిస్తున్న అనుభూతిని ఇస్తాయి. రైలు ముందుకు సాగుతున్న కొద్దీ చల్లటి గాలి మనసును మైమరిపిస్తుంది.

సెమీ హైస్పీడ్ రైళ్ల రూట్ ఖరారు
సెమీ హైస్పీడ్ రైళ్ల రూట్ ఖరారు

ఆవిరి ఇంజన్ వాడారు

ఈ రైల్వే ప్రత్యేకతలలో ఇంజిన్ల చరిత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఈ మార్గంలో వాడే 'ఎక్స్-క్లాస్' ఆవిరి ఇంజిన్‌లను మొదట్లో స్విట్జర్లాండ్‌లోని 'స్విస్ లోకోమోటివ్ అండ్ మెషిన్ వర్క్స్' సంస్థ తయారు చేసింది. కాలక్రమేణా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా మన దేశంలోని తిరుచిరాపల్లి గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్‌లోనూ వీటిని తయారు చేస్తున్నారు. కునూర్ లోకో షెడ్‌లో ఈ ఇంజిన్‌లకు ప్రత్యేకంగా మరమ్మతులు చేస్తూ, వాటి పూర్వ వైభవాన్ని కాపాడుతూ వస్తున్నారు. 1854లో ప్రతిపాదించి, 1891లో నిర్మాణం ప్రారంభించి 1908 నాటికి ఈ మార్గాన్ని పూర్తి చేశారు. ఇది బ్రిటిష్ కాలం నాటి అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది.

యునెస్కో గుర్తింపు

ఈ రైలు మార్గపు చారిత్రక ప్రాధాన్యతను గుర్తించిన యునెస్కో సంస్థ, 2005 జూలైలో దీనికి 'మౌంటెన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా' విభాగంలో ప్రపంచ వారసత్వ హోదా కల్పించింది. ఈ రైలు విశేషాలను, బ్రిటిష్ కాలం నాటి ఇంజినీరింగ్ పరికరాలను నేటి తరానికి పరిచయం చేయడానికి దక్షిణ రైల్వే ప్రత్యేకంగా మ్యూజియంలను ఏర్పాటు చేసింది. అక్టోబర్ 2015లో మెట్టుపాళ్యంలో ఒక రైల్వే మ్యూజియంను, అలాగే జూన్ 2018లో ఊటీ స్టేషన్‌లో మరో హెరిటేజ్ మ్యూజియంను ప్రారంభించారు. ఇక్కడ పాత కాలపు సిగ్నలింగ్ పరికరాలు, ఫోటోలు, నాటి జ్ఞాపకాలను భద్రపరిచారు. డిజిటల్ యుగంలో వింటేజ్ బోగీలలో ప్రయాణిస్తూ 'స్లో ట్రావెల్' అనుభూతిని పొందాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ నీలగిరి రైలు మార్గం నిజమైన స్వర్గధామంలాంటిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+