వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘తెప్ప’లు తప్పలేదు: నది వరద ఉధృతిలో పెళ్లి కోసం సాహసం చేసిన వధువు

|
Google Oneindia TeluguNews

ఈరోడ్‌: తమిళనాడుకు చెందిన ఓ నవ వధువు పెళ్లి కోసం పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. వివాహ వేదిక చేరుకోవడానికి నది దాటాలి.. కానీ, వంతెన సదుపాయం లేకపోవడంతో ప్రమాదకర స్థితిలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని ఓ తెప్ప సాయంతో దాటేసింది. తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆ వధువు పెళ్లి కోసం చేసిన సాహసం గురించిన వివరాల్లోకి వెళితే..
తెంగుమరహడ కొండ గ్రామానికి చెందిన 24ఏళ్ల రాసత్తికి సిరుముగయ్‌ ప్రాంతానికి చెందిన రంజిత్‌ కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. ఆగస్టు 20న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు.

వివాహ వేదికకు చేరాలంటే నది దాటాల్సిందే..

వివాహ వేదికకు చేరాలంటే నది దాటాల్సిందే..

అయితే వివాహ వేదిక వద్దకు చేరాలంటే రాసత్తి కుటుంబం మోయర్‌ నదిని దాటాలి. నదిపై ఎలాంటి వంతెన లేకపోవడంతో పడవల ద్వారానే రాకపోకలు జరుపుతుంటారు. ప్రస్తుత వర్షాల కారణంగా ఆ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు పడవ ప్రయాణాలను నిలిపివేశారు.

Recommended Video

324కు చేరిన మృతులు..వందేళ్లలో ఇదే తొలిసారి.
అనుమతించిన అధికారులు

అనుమతించిన అధికారులు

అయితే వివాహం నేపథ్యంలో రాసత్తి కుటుంబం అధికారులను సంప్రదించి పరిస్థితిని వివరించింది. నది దాటేందుకు ప్రత్యేక అనుమతి కోరింది. తప్పని పరిస్థితి కావడంతో అధికారులు కూడా అంగీకరించారు.

తెప్పల్లోనే..

తెప్పల్లోనే..

ఈ క్రమంలో శుక్రవారం వధువు రాసత్తి సహా 10 మంది కుటుంబసభ్యులు తెప్పల్లో అవతలి ఒడ్డుకు సురక్షితంగా చేరుకున్నారు. తమ ప్రయాణం క్షేమంగా సాగడంతో రాపత్తి ఆనందం వ్యక్తం చేసింది.

వధువు వినతి

వధువు వినతి

తన పెళ్లి కోసం అధికారులు అనుమతులు ఇచ్చినందుకు వారికి రాపత్తి ధన్యవాదాలు తెలిపారు. అయితే, తమ ప్రాంతానికి వంతెన లేకపోవడంతో ప్రజలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వంతెన సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. తమ ప్రయాణం సురక్షితంగా సాగినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

English summary
Undeterred by a flooded Moyar river, a 24-year old bride from a hilly hamlet on the slopes of the Nilgiris has undertaken a daunting ride on a coracle to reach the venue of her marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X