నీరవ్ మోదీ జాకెట్ ఖరీదు ఎంతో తెలుసా ? అక్షరాల 9 లక్షలు
లండన్ : లండన్ వీధుల్లో చక్లర్లు కొట్టిన నీరవ్ మోదీ గురించే చర్చ జరుగుతోంది. లుక్ మారడంతో సోషల్ మీడియాలో ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. పెరిగిన మీసాలు, గడ్డం, జుట్టు పెంచడంపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే నీరవ్ ధరించిన జాకెట్ హాట్ టాపిక్ అయ్యింది.
అస్ట్రిచ్ జాకెట్ : రూ.9 లక్షలు
టెలీగ్రాఫ్ తన కథనంలో నీరవ్ ధరించిన జాకెట్ ను ఫోకస్ చేసింది. వీడియోలో కూడా జాకెట్ స్పష్టంగా కనిపించింది. ఇంతకీ ఈ జాకెట్ ఎంతో తెలుసా .. పదివేల పౌండ్లు .. అంటే అక్షరాల 9 లక్షలు. బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని విదేశాలకు పారిపోయిన మోదీ .. ప్రజాధనంతో రూ.9 లక్షల జాకెట్ ధరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. నీరవ్ ఫోటోను షేర్ చేస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

అస్ట్రిచ్ జాకెట్ తయారీ కోసం ప్రపంచంలోనే ఖరీదైన లెదర్ వాడతారు. అలాగే ఈ లెదర్ ఎక్కువ మన్నికనిస్తోంది. జాకెట్ పై డిజైన్ .. కాలర్ తో అందంగా కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. 'ఇంకా వజ్రాల వ్యాపారం చేయడం, 9 లక్షల జాకెట్ ధరించడం .. చూస్తుంటే అడ్డదారుల్లో వెళ్లిన విలాసాలు తగ్గలేదు' .. లండన్ వీధుల్లో వందల కోట్ల వ్యాపారి సంచరిస్తున్నాడు ' అని వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications