షుగర్, క్యాన్సర్ బాధితులకు శుభవార్త, ఫార్మా, వైద్య రంగాల్లో కీలక పథకాలు ప్రకటించిన నిర్మలమ్మ!
దేశంలో ఫార్మా రంగానికి, వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నట్టు నేడు కేంద్ర బడ్జెట్లో నిర్మల సీతారామన్ వెల్లడించారు. దేశంలో మధుమేహం, క్యాన్సర్ సహా పలు అసంక్రమిత వ్యాధుల బారినపడే వారి సంఖ్య పెరుగుతున్నట్టు తాము గుర్తించినట్టు పేర్కొన్న నిర్మల సీతారామన్ ఐదు సంవత్సరాల కోసం పదివేల కోట్లతో బయో ఫార్మా శక్తి పథకాన్ని ప్రతిపాదిస్తున్నట్టు వెల్లడించారు.
డయాబెటిస్, క్యాన్సర్ బాధితులకు శుభవార్త
డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడి వారి మందుల కోసం భారతదేశంలోనే బయో ఫార్మా రంగాన్ని పటిష్టం చేయనున్నట్లు పేర్కొన్న నిర్మల సీతారామన్ వారికి దీర్ఘాయుష్షును మరియు నాణ్యమైన జీవితాన్ని అందించడంలో జీవ సంబంధమైన మందులు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచ బయో ఫార్మా తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి బయో ఫార్మా శక్తి పథకాన్ని తీసుకు వస్తున్నట్టు ఆమె వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా 5 మెడికల్ హబ్ లు
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు .అంతేకాదు మరోవైపు వైద్య రంగానికి వైద్య అనుబంధ రంగాలకు బడ్జెట్లో భారీగానే కేటాయింపులు చేశారు. వైద్య అనుబంధ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక పథకం తీసుకువస్తున్నట్లు నిర్మల సీతారామన్ తెలిపారు. సుమారు లక్ష ఏ హెచ్ పి లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఐదు మెడికల్ హబ్ ల ఏర్పాటుకు సాయం అందిస్తామని తెలిపారు.
ఆయుర్వేద ఔషధ ఉత్పత్తుల ఎగుమతులకు స్పెషల్ స్కీమ్
నాణ్యమైన ఆయుర్వేద ఔషధ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక పథకం తీసుకువస్తున్నట్లు పేర్కొన్న ఆమె దేశంలో మూడు కొత్త ఆయుర్వేద అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. జామ్ నగర్ లో ఆయుర్వేద ఔషధ అభివృద్ధి సంస్థను నెలకొల్పనున్నట్టు నిర్మల సీతారామన్ వెల్లడించారు. వికసిత్ భారత్ సాధనకు భారత్ ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తుందని ఆమె పేర్కొన్నారు.
క్యాన్సర్ రోగులకు 17 రకాల మెడిసిన్స్ పైన పన్ను తగ్గింపు
అంతేకాదు క్యాన్సర్ రోగులకు 17 రకాల మెడిసిన్స్ పైన పన్ను తగ్గింపు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆయుష్ కేంద్రాల అప్ గ్రేడేషన్ తో పాటు, యువత కోసం వైద్యరంగంలో కొత్త కోర్సులను కూడా ప్రవేశపెడతామని తెలిపారు. ప్రైవేట్ రంగంలో పశు వైద్య మరియు డయాగ్నస్టిక్స్ ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications