నీతా అంబానీ రాధికా మర్చంట్ కు 640కోట్ల అత్యంత ఖరీదైన వెడ్డింగ్ గిఫ్ట్
అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహం కోసం అంబానీ ఫ్యామిలీ రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గుజరాత్ లోని జామ్ నగర్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించిన అంబానీ కుటుంబం మరో ప్రీ వెడ్డింగ్ పార్టీకి కూడా రెడీ అయింది. ఈసారి ఏకంగా ఒక లగ్జరీ క్రూయిజ్ లో చాలా గ్రాండ్ గా పార్టీ చేయడానికి సిద్ధమైంది.
కాబోయే కోడలికి నీతా అంబానీ ఖరీదైన బహుమతి
ఇక ఇదే సమయంలో మరొక ఆసక్తికర విషయం ప్రస్తుతం అందరిని ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ వైపు చూసేలా చేస్తుంది. ఇంతకీ అదేమిటంటే ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ కాబోయే చిన్న కోడలు రాధిక మర్చంట్ కు ఊహించని అద్భుతమైన ఒక బహుమతిని ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. తన చిన్న కోడలికి దుబాయ్ లోని ఒక అద్భుతమైన లగ్జరీ విల్లాను ఇవ్వనున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

640 కోట్ల అత్యంత ఖరీదైన విల్లా
రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ గా, ఎన్ఎంఎసిసి అధ్యక్షురాలిగా ఉన్న నీతా అంబానీ దుబాయ్ లో 640 కోట్ల రూపాయల అత్యంత ఖరీదైన విల్లాను త్వరలో తమ ఇంటికి రానున్న కొత్త కోడలికి గిఫ్ట్ గా అందించనున్నారు. ఈ విల్లాలో పది విలాసవంతమైన బెడ్ రూములు, అద్భుతమైన ఇంటీరియర్స్, ఇటాలియన్ పాలరాయి, అద్భుతమైన కళాకృతులు ఉంటాయట. ఇంకా ఇందులో 70మీటర్ల ప్రైవేటు బీచ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.
భారీ పార్టీలకు లగ్జరీ విల్లా
ఈ బిలియనీర్ ఫ్యామిలీ బస చేయడానికి, భారీ పార్టీలను హోస్ట్ చేయడానికి కూడా ఇది చాలా బాగుంటుందని అంబానీ ఫ్యామిలీ భావిస్తుందట. ఈ క్రమంలోనే కాబోయే కొత్తకోడలికి నీతా అంబానీ ఈ అత్యంత ఖరీదైన బహుమానాన్ని ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల నిశ్చితార్థం సందర్భంగా అనంత్ అంబానీకి 4.5కోట్ల విలువచేసే బెంట్లీ కాంటినెంటల్ జిటిసి స్పీడ్ కారును ముఖేష్ అంబానీ గిఫ్ట్ గా ఇచ్చారు.

ఇప్పటికే కానున్న కోడలికి నీతా అంబానీ బహుమతులు
ఇక కాబోయే కోడలు రాధిక మర్చంట్ కు నీతా అంబానీ తన సొంత డైమండ్ నక్లెస్ తో పాటు, ఖరీదైన రెండు గణపతి విగ్రహాలు, నగలు, కలశాలు కానుకగా ఇచ్చారని సమాచారం. ఏది ఏమైనా అపర కుబేరుడికి కోడలు కాబోయే రాధిక మర్చంట్ కు ఇవ్వబోయే లగ్జరీ విల్లా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications