ట్రంప్ ఇచ్చిన డిన్నర్ లో తళుక్కుమన్న నీతా అంబానీ.. ప్రత్యేకత ఏంటంటే!

మరికొన్ని గంటలలో అమెరికా దేశ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి అతిరథ మహారధులు అందరూ వాషింగ్టన్ కు తరలివచ్చారు. ఇక డోనాల్డ్ ట్రంప్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు ఒక గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు.

ట్రంప్ ఇచ్చిన డిన్నర్ కు నీతా అంబానీ
ఈ డిన్నర్ కు రిలయన్స్ సంస్థ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తో పాటు ఆయన భార్య నీతా అంబానీ కూడా హాజరయ్యారు. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా తన విభిన్నమైన డ్రెస్సింగ్ స్టైల్ తో ప్రతి ఒక్కరి చూపులను కట్టిపడేసే నీతా అంబానీ ట్రంప్ ఏర్పాటుచేసిన డిన్నర్ లో కూడా ఓ అద్భుతమైన చీరను ధరించి అందరిని ఆకట్టుకున్నారు.

Nita Ambani special attraction at Trump dinner these are the specialities

కాంచీపురం నేత చీరలో మెరిసిన నీతా అంబానీ
నలుపు రంగులోని కాంచీపురం నేతతో ఉన్న చీరలో నీతా అంబానీ మెరిసిపోయారు. నలుపు రంగు ఫ్లవర్ బ్లౌజ్ తో పాటు శతాబ్దాలనాటి ఆభరణాలను సైతం ధరించి ట్రంప్ ఇచ్చిన డిన్నర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీతా అంబానీ ధరించిన చీరను ప్రముఖ కళాకారుడు బి కృష్ణమూర్తి నేశారు. ఇక ఆమె బ్లౌజును ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు.

శతాబ్దాల నాటి ఆభరణాలు ధరించిన నీతా అంబానీ
చెవులు, మెడ, చేతికి పచ్చని పూసలు, రాళ్లతో పొదిగిన ఆభరణాలను నీతా అంబానీ ధరించారు. పచ్చరాళ్ళతో తయారుచేసిన చేతి మణికట్టు ఆభరణాన్ని ధరించి చాలా స్పెషల్ గా నీతా అంబానీ కనిపించారు. భారతదేశంపై ఉన్న తన అభిమానాన్ని, అనుబంధాన్ని మనదేశంలోనే తయారైన, ప్రత్యేకంగా తయారు చేసిన స్వదేశీ వస్త్రాలను ధరించి, ట్రెడిషనల్ బంగారు ఆభరణాలను ధరించి నీతా అంబానీ ఇప్పుడు యూఎస్ లో అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు.

ట్రంప్ ప్రమాణ స్వీకారంలో అన్నీ ప్రత్యేకతలే
ఇక ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా క్యారీ అండర్‌వుడ్ మ్యూజిక్ కాన్సెర్ట్ నిర్వహించనున్నారు. ఈ కాన్సెర్ట్ తర్వాత, వైట్ హౌస్ పెన్సిల్వేనియా అవెన్యూ వైపు పరేడ్ నిర్వహించనున్నారు.ఈ పరేడ్ టీమ్ లో ఆర్మీ పాల్గొంటారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన అతిథులు వైట్ హౌస్ సమీపంలోని ప్రత్యేక వేదిక నుండి పరేడ్ వీక్షిస్తారు. అనంతరం డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష కార్యాలయానికి వెళ్తారు. అక్కడ కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేసే అర్దర్స్ పై సంతకాలు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+