ఇథనాల్ లేని పెట్రోల్ ధరల పెంపు? - మరో బాంబుపేల్చిన గడ్కరీ..!
అమెరికా-ఇరాన్ వార్ నేపథ్యంలో చమురు సరఫరాకు మళ్లీ ఆటంకాలు ఏర్పడవచ్చని భావిస్తున్న తరుణంలో కేంద్రం ఇవాళ మరో బాంబుపేల్చింది. దిగుమతుల్ని తగ్గించుకునే లక్ష్యంతో పెట్రోల్ (Petrol) లో ఇథనాల్ కలిపి వాహనదారులకు సరఫరా చేసేందుకు సిద్దమవవుతున్న కేంద్రానికి తాజాగా షాకులు తగులుతున్నాయి. ఇలా ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వల్ల తమ వాహనాలకు మైలేజ్ తగ్గిపోతోందని, వాహనాలు పాడైపోతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్రమంత్రి గడ్కరీ (Nitin Gadkari) ఇవాళ వాహనదారులకు భారీ షాకిచ్చారు.
ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల ఎదురవుతున్న సమస్యల్ని తక్కువ చేసి చూపుతున్న కేంద్రం.. వాహనదారులతో దీన్ని ఎలాగైనా వాడించాలని పట్టుదలగా ఉంది. దీంతో ఇథనాల్ కలిపిన పెట్రోల్ కంటే 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ కు త్వరలో మరింత ధర చెల్లించాల్సి ఉంటుందని కేంద్రమంత్రి గడ్కరీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇథనాల్ మిశ్రిత పెట్రోల్ వాడటానికి ఇష్టపడని వాహనదారులు 100% పెట్రోల్‌ను ఎంచుకోవచ్చని, అయితే దానికి వారు అధిక ధర చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.

E20 ఇంధనం వాహనాల ఇంజిన్లను దెబ్బతీస్తుందన్న ఆందోళనలను మరోసారి తోసిపుచ్చిన గడ్కరీ..ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని స్పష్టం చేశారు. పెట్రోల్ బంకుల్లో ఈ20తో పాటు ఈ10 పెట్రోల్‌ను కూడా అందుబాటులో
ఉంచబోతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం.. ఇప్పటికే 20 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. పెట్రోల్ పంపులు వినియోగదారులకు బహుళ ఇథనాల్ మిశ్రమాలను అందిస్తాయా లేదా అనే ప్రశ్నకు, ఆ నిర్ణయం పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందని గడ్కరీ తెలిపారు. ప్రభుత్వ ఇథనాల్ విధానంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ, తనకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ ప్రేరేపిత తప్పుడు సమాచార ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.















Click it and Unblock the Notifications