సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పని చేసింది వీళ్లే..!!
బీహార్‌లో జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తోన్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది పదోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
74 ఏళ్ల నితీష్ కుమార్, 19 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ వస్తోన్నారు. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన టాప్-10 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇది ఆయనకు మరొక మైలురాయి. ఈ జాబితాలో సిక్కింకు చెందిన పవన్ కుమార్ చామ్లింగ్, ఒడిశా నుంచి బిజూ జనతాదళ్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వంటి నాయకులు దశాబ్దాలుగా సీఎంగా పని చేసిన వారిలో ఉన్నారు.

ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రుల జాబితా..
1. పవన్ కుమార్ చామ్లింగ్: సిక్కిం ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాలకు పైగా పని చేశారు. 1994 డిసెంబర్ 12 నుంచి 2019 మే 26 వరకు కొనసాగారు.
2. నవీన్ పట్నాయక్: 24 సంవత్సరాలకు పైగా ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. తొలిసారిగా 2000 మార్చి 5వ తేదీన సీఎంగా ప్రమాణం చేసిన ఆయన.. 2024 జూన్ 11 వరకు కొనసాగారు.
3. జ్యోతి బసు: 23 సంవత్సరాలకు పైగా పశ్చిమ బెంగాల్ ఖ్యమంత్రిగా పని చేశారు. 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 5వ తేదీ వరకు పదవిలో ఉన్నారు.
4. గెగాంగ్ అపాంగ్: అరుణాచల్ ప్రదేశ్ కు 22 సంవత్సరాలకు పైగా సీఎంగా పని చేసిన అనుభవం ఉంది. 1980 జనవరి 18 నుంచి 1999 - జనవరి 19, ఆ తర్వాత 2003 ఆగస్టు 3 నుంచి 2007 ఏప్రిల్ 9 వరకు పదవిలో కొనసాగారు.
5. లాల్ థన్హా వాలా: దశలవారీగా 22 సంవత్సరాలకు పైగా మిజోరాం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు . 1984 మే 5 నుండి 1986 ఆగస్టు 21, 1989 జనవరి 24 నుండి 1998 డిసెంబర్ 3, 2008 డిసెంబర్ 11 నుండి 2018 డిసెంబర్ 15 వరకు పని చేశారు.
6. వీరభద్ర సింగ్: హిమాచల్ ప్రదేశ్ కు 21 సంవత్సరాల పాటు పని చేశారు. 1983 ఏప్రిల్ 8 నుండి 1990 మార్చి 5, 1993 డిసెంబర్ 3 నుండి 1998 మార్చి 24, 2003 మార్చి 6 నుండి 2007 డిసెంబర్ 30, 2012 డిసెంబర్ 25 నుండి 2017 డిసెంబర్ 27 వరకు ఉన్నారు.
7. మాణిక్ సర్కార్: 19 సంవత్సరాల పాటు త్రిపుర సీఎంగా పని చేశారు. 1998 మార్చి 11 నుండి 2018 మార్చి 9 వరకు కొనసాగారు.
8. నితీష్ కుమార్: 2000 మార్చి 3 నుండి మార్చి 11, 2005 నవంబర్ 24 నుండి 2014 మే 20, 2015 ఫిబ్రవరి 22 నుండి 2025 నవంబర్ 19 వరకు బీహార్ సీఎంగా పని చేశారు. ఇప్పుడు మళ్లీ ప్రమాణం చేశారు.
9. కరుణానిధి: 18 సంవత్సరాలకు పైగా తమిళనాడు సీఎంగా పని చేశారు. 1969 ఫిబ్రవరి 10 నుండి 1976 జనవరి 31, 1989 జనవరి 27 నుండి 1991 - జనవరి 30, 1996 మే 14 నుండి 2001 మే 13, 2006 మే నుండి 2011 మే 16 వరకు కొనసాగారు.
10. ప్రకాష్ సింగ్ బాదల్: పంజాబ్ కు కూడా 18 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. 1970 మార్చి 27 నుండి 1971 జూన్ 14, 1977 ఫిబ్రవరి 17 నుండి 1980 జూన్ 20, 1997 ఫిబ్రవరి 12 నుండి 2002 ఫిబ్రవరి 26, 2007 మార్చి 1 నుండి 2017 మార్చి 16 వరకు పంజాబ్ సీఎంగా పని చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications