సీమాంధ్రకైతే ఇస్తారు, మాకివ్వరా: నితీష్ కుమార్

ప్రత్యేక హోదా కోరుతూ ఆదివారం బీహార్ బంద్ పాటించాలని నితీశ్ ఇంతకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆయన జేడీయూలోని సీనియర్ నేతలతో కలిసి తన అధికారిక నివాసం నుంచి బయలుదేరి కాలినడకన గాంధీ మైదాన్ వద్దకు చేరుకున్నారు. ఐదు గంటల సేపు అక్కడ నిరసన తెలిపిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
బీహార్‌కు ప్రత్యేక హోదా సాధించాలన్న తమ లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాకు ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వడానికి కేంద్రం నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ అధికార బిజెడి యువ కార్యకర్తలు ఆదివారం బ్లాక్ డేగా పాటించారు. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని చాలాకాలంగా కోరుతున్నామని, అయినా కేంద్రం పట్టించుకోవట్లేదని ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ మండిపడ్డారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై ఒడిశాలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరసింహ మిశ్రా విచిత్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినందున ఆ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చిందని, ఒడిశాకు కూడా ఇవ్వాలంటే రాష్ట్రాన్ని బిజెడి రెండు ముక్కలుగా విడగొట్టాలని మీడియాతో అన్నారు.












Click it and Unblock the Notifications