రేపు బీహార్లో అఖిలపక్ష భేటీకి నితీష్ పిలుపు-కులగణన ఫలితాలతో బీజేపీపై ఒత్తిడి పెంచేలా..
బీహార్లో తాజాగా నిర్వహించిన కులాల సర్వే ఫలితాల్ని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. దీనిపై బీహార్ తో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లోపు దేశవ్యాప్తంగా ఇలాగే కులాల సర్వే నిర్వహించాలని విపక్ష ఇండియా కూటమి కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న వేళ కులాల సర్వే ఫలితాల విడుదలతో నితీష్ సర్కార్ ఓ అడుగు ముందుకేసింది. అంతటితో ఆగకుండా రేపు దీనిపై చర్చించేందుకు అఖిలపక్ష భేటీ కూడా ఏర్పాటు చేసింది.
బీహార్ జాతి అధారిత్ గణన అని కూడా పిలువబడే కుల ఆధారిత సర్వే మొత్తం 13 కోట్లకు పైగా జనాభా ఉన్నట్లు గుర్తించింది. ఈ జనాభాలో వెనుకబడిన తరగతి 27 శాతం ఉండగా, అత్యంత వెనుకబడిన తరగతి 36 శాతం మంది ఉన్నారని వెల్లడించింది. ఈ లెక్కన వెనుకబడిన కులాల మొత్తం జనాభా 63 శాతంగా ఉన్నట్లు తేలింది. అలాగే షెడ్యూల్డ్ కులాలు 19 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉండగా.షెడ్యూల్డ్ తెగలు 1.68 శాతంగా ఉన్నారు. అగ్ర కులాలు లేదా సవర్ణలు జనాభాలో 15.52 శాతం మందిగా తేలారు. జనాభాలో భూమిహార్లు 2.86%, బ్రాహ్మణులు 3.66%, కుర్మీలు 2.87%, ముసాహర్లు 3% మరియు యాదవులు 14% ఉన్నారు.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రేపు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. బీహార్ కుల గణన నివేదిక వివరాలను అన్ని పార్టీలతో పంచుకునేందుకు ఈ సమావేశం జరపాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం గురించి చర్చించారు. రాష్ట్రంలోని మొత్తం తొమ్మిది పార్టీలు ఇందులో పాల్గొనాలని ఆయన కోరారు. సర్వే ఫలితాల వెనుక ఉన్న లెక్కలు, ప్రజల ఆర్థిక స్థితిగతులపై సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని నితీష్ చెప్పారు.
కులాల సర్వే నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. వెనుకబడిన వర్గాల కోసం ఆ పార్టీ ఏం చేసిందని బీజేపీని ఉద్దేశించి ప్రశ్నించారు.నితీష్ కుమార్ మిత్రపక్షం, ఆర్‌జేడీ అధినేత లాలూ యాదవ్ మాట్లాడుతూ ఇదొక చారిత్రాత్మక ఘట్టమన్నారు. ఈ రిపోర్టు ఆధారంగా బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు బీహార్లో యూపీఏ సర్కార్ సిద్ధమవుతోంది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications