మోడీకి నితీష్ ఆహ్వానం: ప్రధాని హాజరు కాకపోవచ్చు
పాట్నా: ఈ నెల 20వ తేదీన నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆయన ఆహ్వానించారు. బుధవారం నాడు నితీష్ కుమార్... స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్ చేశారు.
ఈ నెల 20వ తేదీన పాట్నాలోని గాంధీ మైదానంలో మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని మోడీని నితీష్ ఆహ్వానించారని బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
నాలుగు రోజుల ఛత్ వేడుక ముగియడంతో ఈ ఉదయం పలువురు ప్రముఖులకు నితీశే స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారన్నారు. అయితే ముందుగా ఫిక్స్ చేసిన కార్యక్రమాల వల్ల ప్రధాని మోడీ కార్యక్రమానికి రాలేకపోవచ్చని బీహార్ బీజేపీ ఉపాధ్యక్షుడు సంజయ్ మయూఖ్ చెప్పారు.

బీజేపీ తరపున కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సహాయ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీలు హాజరు కావొచ్చు. నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులకు ఆహ్వానాలు వెళ్లాయి.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకే అధినేత కరుణానిధిని కూడా నితీషఅ ఆహ్వానించారు. అయితే, కరుణానిధి సతీమణి భార్య దయాళు అమ్మాల్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉండటంతో హాజరు కాలేరని తెలుస్తోంది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications