ఎన్డీఏ కూటమికి 4000 సీట్లు!: ప్రధాని మోడీ పాదాలను తాకిన సీఎం నితీష్ కుమార్!!
పాట్నా: బీహార్ రాష్ట్రంలోని నవడా ప్రాంతంలో బీజేపీ, జేడీయూ సంయుక్తంగా నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ర్యాలీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ సభలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ప్రసంగం చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ పక్కన కూర్చున్నారు. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకున్నారు. అదే సమయంలో సీఎం నితీష్ కుమార్ ప్రధాని మోడీ పాదాలను తాకినట్లు కనిపించింది. దీంతో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి.
అంతకుముందు నితీష్ కుమార్ మాట్లాడుతూ.. 400కు బదులు ఎన్డీఏ కూటమికి 4000లకుపైగా సీట్లు వస్తాయన్నారు. ఆ తర్వాత వెంటనే సర్దుకుని 400 అని చెప్పారు. అయితే, 4వేల సీట్ల వస్తాయన్న వీడియోను వైరల్ చేస్తూ ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. అంతేగాక, సీనియర్ సీఎం అయిన నితీష్ కుమార్ ప్రధాని మోడీ పాదాలను తాకాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆయన వైఖరిపై మండిపడుతున్నారు.

నితీశ్ కుమార్.. ప్రధాని మోడీ పాదాలను తాకడం సిగ్గుచేటని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. ఈరోజు నితీష్ కుమార్ ప్రధాని మోడీ పాదాలను తాకిన ఫొటో చూశాను. మాకు సిగ్గుగా అనిపించింది. ఆయనకు ఏమైంది? నితీశ్ కుమార్ మా కాపలాదారు. నితీశ్ అంత అనుభవం ఉన్న సీఎం మరొకరు లేరు. ఆయన ప్రధాని మోడీ పాదాలను తాకుతున్నారు అని మండిపడ్డారు. ఇది ఆయనలాంటి సీనియర్ చేసివుండాల్సింది కాదని అన్నారు.
आज नीतीश जी ने तो 4000 पार का नारा लगा दिया। 🤣 pic.twitter.com/Sef6ACaSxo
— Kanchana Yadav (@Kanchanyadav000) April 7, 2024
కాగా, నితీష్ కుమార్ ప్రసంగం తర్వాత ప్రధాని మోడీ దగ్గరకు వచ్చారు నితీష్ కుమార్. మీరు బాగా ప్రసంగించారని.. తాను మాట్లతాడటానికి ఏమీ లేదని ప్రధాని అనడంతో ఇద్దరు నేతల మధ్య నవ్వులు విరబూశాయి. ఈ క్రమంలోనే నితీష్ ప్రధాని పాదాలను తాకడం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications