సచిన్ పైలట్‌కు హైకోర్టులో ఊరట: అప్పటి వరకు చర్యలు వద్దని స్పీకర్‌కు ఆదేశం
జైపూర్: కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత సచిన్ పైలట్‌కు రాజస్థాన్ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. జులై 21 వరకు మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తోపాటు 18 ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని శుక్రవారం రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సచిన్ పైలట్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాదులు
సచిన్ పైలట్ సహా 18 మంది రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరపున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహిత్గీ వాదించారు. జులై మొదటి వారంలో జరిగిన కాంగ్రెస్ లేజిస్లేటివ్ పార్టీ సమావేశానికి గైర్హాజరైన నేపథ్యంలో సచిన్ పైలట్ తోపాటు 18 మంది ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

జులై 21 వరకూ సచిన్, ఆయన వర్గం ఎమ్మెల్యేలపై చర్యలొద్దు
జులై 21 వరకు సచిన్ సహా 18 మంది రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ప్రధాన న్యాయమూర్తి ఇంద్రజిత్ మోహంతి, జస్టిస్ ప్రకాశ్ గుప్తాలతో కూడిన రాజస్థాన్ హైకోర్టు ధర్మాసనం రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌కు స్పష్టం చేసింది. కాగా, రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర సీపీ జోషీ తరపున అభిషేక్ మను సింఘ్వీ జులై 20న తన వాదనలను కోర్టులో వినిపించనున్నారు.

సచిన్ కోసం కాంగ్రెస్ ద్వారాలు తెరిచేవున్నాయి..
కాగా, కీలక నేత అయిన సచిన్ పైలట్, ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలకు ఇప్పటికే ద్వారాలు తెరిచేవున్నాయని కాంగ్రెస్ పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేగాక, సచిన్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేయవద్దని కూడా స్పష్టం చేస్తున్నారు.ఇది ఇలావుండగా,రాజస్థాన్ అసెంబ్లీ కాంగ్రెస్ విప్ మహేష్ జోషీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్ఓజీ) పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జరిగిన కుట్రలు టెలిఫోన్ ఆడియో టేపుల్లో బయటపడ్డాయని తన ఫిర్యాదులో జోషీ తెలిపారు.
Recommended Video

గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలేదు
అయితే, తాము గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు చేయలేదని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. తమకు ఆ ఉద్దేశం కూడా లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనవసర, అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. వైరల్ అవుతున్న ఆ ఆడియో టేపులు నకిలీవని అన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో సచిన్ పైలట్‌ను బీజేపీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, సచిన్ మాత్రం తాను బీజేపీలో చేరడం లేదని ప్రకటించారు. సచిన్ కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications