సీఎం ఎమ్మెల్యేల బలపరీక్షకు నో చాన్స్: హైకోర్టు, ఊపిరిపీల్చుకున్న పళని, పన్నీర్ !

మైనారిటీలో తమిళనాడు ప్రభుత్వంమద్రాస్ హైకోర్టులో సీఎం పళని, పన్నీర్ కు ఊరట20వ తేదీ వరకు బలపరీక్ష వద్దు, మద్రాస్ హైకోర్టు ఆదేశాలు

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కాస్త ఊపిరిపీల్చుకున్నారు. సెప్టెంబర్ 20వ తేదీ వరకు శాసన సభలో పళనిసామికి ఎమ్మెల్యేల బలపరీక్ష నిర్వహించకూడదని గురువారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు లేదని, మైనారిటీలో ఉన్న పళనిసామి ప్రభుత్వానికి శాసన సభలో బలపరీక్ష నిర్వహించడానికి ఆదేశాలు జారీ చెయ్యాలని టీటీవీ దినకరన్ వర్గంలోని రెబల్ ఎమ్మెల్యేలు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ వేరువేరుగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

No floor test in Tamil Nau assembly till Sept 20

గురువారం పిటిషన్ విచారణకు స్వీకరించిన మద్రాసు హైకోర్టు ఈనెల 20వ తేదీ వరకు సీఎం ఎడప్పాడి పళనిసామికి ఎలాంటి బలపరీక్ష నిర్వహించకూడదని మద్రాసు హైకోర్టు తమిళనాడు శాసన సభ స్పీకర్ ధనపాల్ కు సూచించింది.

మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో తమిళనాడుకు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి కాస్త ఊరట లభించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే పార్టీని హైజాక్ చేశారని, మాదే నిజమైన అన్నాడీఎంకే పార్టీ అని దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+