వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎల్ఏను మన సైనికులు వెనక్కిపంపారు: చైనా ప్రతిష్టంభనపై పార్లమెంట్‌లో రాజ్‌నాథ్ సింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో చైనాతో జరిగిన తాజా ప్రతిష్టంభనపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటన చేశారు.
ఎల్ఏసీ వద్ద జరిగిన ప్రతిష్టంభనలో భారత సైనికులెవరూ తీవ్రంగా గాయపడలేదని లేదా వీరమరణం పొందలేదని రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతున్న ప్రతిపక్షాలు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.

డిసెంబర్ 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలోని ఎల్ఏసీని ఆక్రమించడం ద్వారా పీఎల్ఏ వర్గం ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించిందని తెలిపారు. అయితే, చైనా చేసిన ఈ ప్రయత్నాన్ని మన సైన్యం దృఢ సంకల్పంతో ఎదుర్కొంది. ఈ క్రమంలో తోపులాట జరిగిందన్నారు రాజ్‌నాథ్ సింగ్.

 No Indian Soldier seriously injured In Face-Off With China At Arunachal LAC: Rajnath Singh in Parliament

పీఎల్ఏ మన భూభాగంలోకి చొరబడకుండా భారత సైన్యం ధైర్యంగా అడ్డుకుంది. వారిని వారి స్థానాలకు ఉపసంహరించుకునేలా చేసింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇరువైపులా కొందరు సైనికులు గాయపడ్డారు. మన సైనికులు ఎవరూ చనిపోలేదని, ఎవరూ తీవ్రంగా గాయపడలేదని ఈ సభకు తెలియజేయాలనుకుంటున్నాను. భారత సైనిక కమాండర్ల సకాలంలో జోక్యం చేసుకోవడంతో పీఎల్ఏ దళాలు తిరిగి తమ స్థానాలకు వెళ్లిపోయాయని రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో వెల్లడించారు.


అంతకుముందు, అరుణాచల్ ప్రదేశ్ వాస్తవ నియంత్రణ రేఖ వద్ద తవాంగ్ సమీపంలో భారత్-చైనా దళాల మధ్య ప్రతిష్టంభన తర్వాత రాజ్‌నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్‌లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైమానిక దళం, నేవీ సీనియర్ కమాండర్లు కూడా పాల్గొన్నారు.

English summary
No Indian Soldier seriously injured In Face-Off With China At Arunachal LAC: Rajnath Singh in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X