న్యూ ఇయర్ వేడుకలు కూడా నో.. సెకండ్ వేవ్ వల్లే..? కొన్ని రాష్ట్రాల నిర్ణయం..?
కొత్త సంవత్సరం వస్తుందంటే ఆ జోషే వేరు.. యువత ఉరిమే ఉత్సాహాంతో న్యూ ఇయర్‌కు వెల్ కం చెబుతోంది. కుర్రకారును ఆపడం తరం కాదు. కానీ గత ఏడాది నుంచి పరిస్థితి మారిపోయింది. కరోనా వైరస్ వల్ల ఏటు వెళ్లలేం.. వెళ్లినా మాస్క్ పెట్టుకొని, చేతిలో శానిటైజర్ పట్టుకొని ఉండాల్సిందే. హితులు, స్నేహితులతో మనసువిప్పి మాట్లాడలేం. కానీ న్యూ ఇయర్ అంటే.. సెలబ్రేషన్ మూడ్.. దాంతో వైరస్ కేసులు పెరుగుతాయని భావించి వేడుకలను రద్దు చేయాలని పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటాయి. వాస్తవానికి రాష్ట్రానికి ఆదాయం వస్తోన్నా.. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటోంది. అయితే వ్యాక్సిన్ కూడా రెండు, మూడు నెలల్లో రానున్న సంగతి తెలిసిందే. ఇప్పట్లో వేడుకలకు అనుమతిచ్చి.. ఎందుకు కోరి ప్రమాదాన్ని ఎంచుకుందామని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

డిసెంబర్ 31 అంటేనే జోష్..
న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31న యువత ఉత్సాహంగా జరుపుకుంటోంది. అయితే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈ సారి ఆ ఉత్సాహం కనిపించే అవకాశాలు లేవు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రెండో దశ కూడా మొదలైందని తెలుస్తోంది. దీంతో ఆంక్షలు విధించడం తప్పనిసరి కానుంది. న్యూ ఇయర్ వేడుకలపై ప్రభావం చూపనుంది. దీనికి సంబంధించి కొవిడ్ సాంకేతిక సలహా సమితి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలను పలు రాష్ట్రాలు విధించనున్నాయి.

ఆంక్షలు..
ఎక్కువ మంది జనం ఒక చోటకు చేరకుండా ఇప్పటికే దేశవ్యాప్తంగా అమలవుతున్న సంగతి తెలిసిందే. వివాహాది శుభకార్యాలకు, రాజకీయ సమావేశాలకు మాత్రం పరిమితులతో కూడిన అనుమతులను జారీ చేస్తున్నారు. దేశంలో పెళ్లికి 100 మంది, రాజకీయ సమావేశాలకు మీటింగ్ హాల్ లో 50 శాతం కెపాసిటీ లేదా 200 మంది, అంత్యక్రియలకు 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే..
ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్‌లో నిబంధనలను అతిక్రమణపై ఫోకస్ చేశారు. శీతాకాలం కావడం, గాలిలో కాలుష్యం పెరిగిన నేపథ్యంలో కేసులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ఇయర్ ఎండింగ్ వేడుకలపై ఆంక్షలు విధించే ప్రయత్నాల్లో ఉంది. ఈ విషయాన్ని ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ తెలిపారు. ఈ నె 20 నుంచి జనవరి 2 వరకూ ఆంక్షలు కఠినంగా అమయ్యేలా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

కర్ణాటక, ఢిల్లీ.. రాష్ట్రాలు
కర్ణాటక మాదిరిగా ఢిల్లీ సర్కారు కూడా ఇదేవిధంగా అమలు చేయాలని భావిస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల వల్ల కేసులు పెరగకుండా చూసేందుకు నిబంధనలను విధించాలని భావిస్తోంది. అంతేకాదు పటిష్ఠంగా అమలు చేస్తామని సంకేతాలను ఇస్తోంది. కర్ణాటక, ఢిల్లీ మాదిరిగా మిగతా రాష్ట్రాలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నాయని విశ్వసనీయంగా తెలిసింది.