అడిగితే నేను బొట్టు పెట్ట: మోడీ ముస్లిం టోపీపై మదాని

న్యూఢిల్లీ: గోద్రా అల్లర్లు, గతంలో నరేంద్ర మోడీ ముస్లిం టోపీని పెట్టుకునేందుకు నిరాకరించడంపై ముస్లిం మత గురువు మౌలానా మహమూద్ మదానీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముస్లింల టోపీని మోడీ ధరించక పోవడం అనే అంశాన్ని పక్కన పెట్టాలని హితవు పలికారు. ఆ మాటకు వస్తే తాను కూడా నుదుట సింధూరాన్ని పెట్టనని చెప్పారు. ఎవరైనా తనను తిలకం పెట్టుకోమని అడిగితే... తాను అంగీకరించనని, ఇదో విషయమే కాదని అభిప్రాయపడ్డారు.

తాను తిలకం పెట్టుకోనంత మాత్రాన చెడ్డ వ్యక్తిని కాదన్నారు. కొందరు నాయకులు టోపీలు ధరించి ముస్లింలను ఫూల్స్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. టోపీ ధరించనని చెప్పినంత మాత్రాన చెడ్డ వ్యక్తి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. గోద్రా అల్లర్ల కేసులో మోడీ తప్పు చేసి ఉంటే ఆయనను శిక్షించాలన్నారు. క్షమాపణ ఏం చేస్తుందని అభిప్రాయపడ్డారు. మోడీ ముస్లిం సామాజికవర్గంతో మంచి సంబంధాలు ఏర్పర్చుకోవాలని ఆయన అన్నారు.

No point in Modi apologising for riots: Madani

మోడీకి బిస్మిల్లాఖాన్ కుటుంబం షాక్

వారణాసి లోకసభ నుండి పోటీ చేస్తున్న మోడీకి దివంగత షెహనాయ్ విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కుటుంబ సభ్యులు షాకిచ్చారు! ఈ నెల 24న మోడీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేయననున్నారు. మోడీ నామినేషన్ సమయంలో... పండిట్ మదన్ మోహన్ మాలవీయ మనువడితో పాటు తమ కుటుంబ సభ్యులు ప్రతిపాదకులుగా ఉండాలని మోడీ కోరుకున్నట్లు మేయర్ రాంగోపాల్ మెహాలే చెప్పారట.

అయితే, అందుకు వారు సున్నితంగా తిరస్కరించారు. సంగీతం గురించి గంటల తరబడి చర్చిండానికి తాము సిద్ధమని అయితే, రాజకీయాలకు దూరంగా తనను ఉంచాలని బిస్మిల్లా ఎప్పుడు చెప్పేవారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బిస్మిల్లాఖాన్ మనువడు అఫాక్ హైదర్‌ను రాంగోపాల్ మెహాలే కలుసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+