వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రాష్ట్రంలో జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు: జనసమ్మర్థంపై నిషేధం: ఇద్దరు గుమికూడినా

|
Google Oneindia TeluguNews

లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా రెండో దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. 19 రోజుల రెండోదశ లాక్‌డౌన్ వచ్చేనెల 3వ తేదీ నాటికి ముగియబోతోంది. ఆ తరువాత పరిస్థితేమిటీ? ఎలా ఉంటుందనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. ఇంకా సమయం మిగిలి ఉన్నందున పొడిగింపుపై ఎలాంటి ముందస్తు ప్రకటనా చేయలేదు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

లాక్‌డౌన్ తరహా పరిస్థితులను జూన్ 30వ తేదీ వరకూ పొడిగించింది. కర్ఫ్యూ తరహా వాతావరణం కొనసాగుతోందని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తిరుగాడటాన్ని నిషేధించింది. ఒకరికి మించి గుమికూడవద్దని హెచ్చరించింది. జూన్ 30వ తేదీ వరకూ ఇవే పరిస్థితులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆ తరువాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అనుగుణంగా.. అనుకూలంగా నిర్ణయాన్ని తీసుకుంటామని పేర్కొంది.

ఈ మేరకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు మృత్యుంజయ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనిపై ఆయన ఓ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంటోందని, దీన్ని నియంత్రించడానికి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటోందని అన్నారు. అయినప్పటికీ.. కరోనా వైరస్ అదుపులోకి రావట్లేదని చెప్పారు. దీన్ని నియంత్రించానికి ముఖ్యమంత్రి యోగి కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నారని చెప్పారు.

ఇందులో భాగంగా- జూన్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు వెల్లడించారు. లాక్‌డౌన్ తరహా వాతావరణం కొనసాగుతుందని అన్నారు. ప్రజలు గుమికూడటంపై నిషేధాన్ని విధించామని చెప్పారు. 11 మందితో ఏర్పాటైన నిపుణుల కమిటీ సమావేశం అనంతరం యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ సోకకుండా నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది.

No public gatherings will be allowed in Uttar Pradesh till June 30

అయినప్పటికీ.. దాని ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావట్లేదనే అసంతృప్తిని యోగి ఆదిత్యనాథ్ వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. వైరస్‌ను నిర్మూలించడానికి సామాజిక దూరాన్ని పాటించడం ఇంటి పట్టునే ఉండటం వంటి చర్యలు ఉపయోగ పడతాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించినట్లు మృత్యుంజయ కుమార్ తెలిపారు.

English summary
No public gatherings will be allowed in Uttar Pradesh till June 30, Chief Minister Yogi Adityanath said this morning amid concern over the rising numbers of COVID-19 cases in the state. The order, which will impact large gatherings like political rallies and social functions, has been described as a necessary measure to control the spread of the virus. Chief Minister Yogi Adityanathji has given strict instructions to the officers that no crowd of any kind can be gathered by June 30. This decision has been taken with the intention of keeping the corona under control," Mrityunjay Kumar, the media advisor to the Chief Minister, tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X