మహాత్మా గాంధీ అంటే ఎవరికి తెలుసు?: మోదీ షాకింగ్

Lok Sabha elections 2024 Phase 7: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. జూన్ 1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరుగనుంది. ఇదే చివరిది. ఇప్పటివరకు ఆరుదశల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది.

చివరి విడతలో మొత్తం ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. బిహార్- 8, చండీగఢ్- 1, హిమాచల్ ప్రదేశ్- 4, జార్ఖండ్- 3, ఒడిశా- 6, పంజాబ్- 13, ఉత్తరప్రదేశ్- 13, పశ్చిమ బెంగాల్- 9 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ షెడ్యూల్ అయిందా రోజున.

Nobody in the world knew of Mahatma Gandhi before the film was made says PM Modi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా మొత్తం 598 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. మోదీ పోటీలో నిలిచిన ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి నియోజకవర్గానికీ అదే రోజున పోలింగ్ ఉంటుంది. చివరి దశలో కూడా పైచేయి సాధించడానికి ఎన్డీఏ, ఇండియా కూటమి నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోన్నారు. ముమ్మరంగా ప్రచారం సాగిస్తోన్నారు.

ఈ పరిస్థితుల్లో జాతిపిత మహాత్మా గాంధీపై ప్రధాని మోదీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ జాతీయ న్యూస్ ఛానల్‌కు ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

మహాత్మా గాంధీ అంటే బయటి ప్రపంచంలో ఎవరికీ తెలియదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం సిద్ధించిన ఈ 75 సంవత్సరాల్లో మహాత్ముడి గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత తమపై లేదా? అని ప్రశ్నించారు.

మహాత్ముడిపై హాలీవుడ్‌లో తీసిన గాంధీ సినిమా విడుదలైన తరువాతే ఆయన గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ప్రపంచ దేశాల్లో ఏర్పడిందని పేర్కొన్నారు. గాంధీకి ప్రపంచ దేశాల్లో ప్రాచుర్యాన్ని కల్పించే విషయంలో తాము విఫలం అయ్యామని మోదీ తేల్చి చెప్పారు. గాంధీ సినిమాను తీయడం ద్వారా ఆ పనిని విదేశీయులు చేసి చూపించారని పేర్కొన్నారు.

మోదీ చేసిన ఈ వ్యాఖ్యలను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తిప్పి కొట్టారు. మహాత్ముడిని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే సిద్ధాంతాలను అనుసరించే వాళ్లు ఎప్పటికీ బాపూజీ చూపిన సత్య మార్గంలో ప్రయాణించలేరని ఖర్గే అన్నారు. ఇప్పుడు అబద్ధాల జోలెను మోస్తూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

మహాత్మా గాంధీ మీద హాలీవుడ్‌లో తీసిన సినిమాను చూడాల్సిన అవసరం పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్‌కు మాత్రమే ఏర్పడి ఉండొచ్చని మోదీకి చురకలు అంటించారు. ఈ మేరకు తమ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో కామెంట్స్ పోస్ట్ చేశారు. మహాత్ముడిపై రిచర్డ్ ఆటెన్‌బర్గ్ తీసిన గాంధీ సినిమా 1982లో విడుదలైన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+