జహంగీర్ పురీ అకృత్యాలు-సుప్రీం ఉత్తర్వుల బేఖాతరు- జేసీబీల ప్రయోగం-నిందితుల పేరుతో

ఢిల్లీలోని జహంగీర్ పురీలో ఉత్తర ఢిల్లీ కార్పోరేషన్ అధికారులు దాష్టీకానికి పాల్పడ్డారు. తాజాగా ఈ ప్రాంతంలో మతఘర్షణలు చెలరేగగా.. ఇందులో కొందరిని టార్గెట్ చేస్తూ వారి ఆస్తుల్ని ఇవాళ జేసీబీలతో ధ్వంసం చేశారు. బాధితులు సకాలంలో స్పందించి సుప్రీంకోర్టును ఆశ్రయించినా, కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా పట్టించుకోకుండా రెచ్చిపోయారు.

జహంగీర్ పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పేరుతో ఇవాళ రంగంలోకి దిగిన ఉత్తర ఢిల్లీ కార్పోరేషన్ అధికారులు రెచ్చిపోయారు. బుల్ డోజర్లతో వచ్చిన అధికారుల దూకుడు చూసి బాధితులు వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా అదే స్పీడులో విచారణ జరిపింది. వెంటనే స్టేటస్ కో ఉత్తర్వులు కూడా జారీ చేసింది.అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులు అధికారులకు అందేలోపు బాధితులు వాటిని తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు కూల్చివేతలు ఆపాలని ఉత్తర్వులు ఇచ్చిందని వారికి వివరించారు. కానీ వారు అవేవీ పట్టించుకునే పరిస్ధితుల్లో లేరు. తమకు ఆదేశాలు అందలేదంటూ కూల్చివేతలు కొనసాగించారు. ఈ దశలో బాధితులతో పాటు సీపీఎం నేత బృందా కారత్ సైతం సుప్రీంకోర్టు ఆదేశాలను చూపుతూ జేసీబీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినా కూల్చివేతల పర్వం కొనసాగింది. ఇందులో తమ ఆస్తులు ధ్వంసం కావడంపై బాధితులు తీవ్రంగా మండిపడుతున్నారు.

north delhi corporation officials move buldozer on victims houses even they show sc order

నా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయని వారికి చెప్పానని, కానీ వారు వినలేదని, కూల్చివేతను సుప్రీంకోర్టు ఒక గంట క్రితం నిలిపివేసిందని తాము చెప్పినా ఆపలేదని స్ధానిక జ్యూస్ షాప్ యజమాని గణేష్ కుమార్ గుప్తా తెలిపారు. శనివారం జహంగీర్‌పురిలో జరిగిన మత ఘర్షణలో హింసకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అక్రమంగా నిర్మించిన కట్టడాల్లో నివసిస్తున్నారని ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా చెప్పడంతో కార్పోరేషన్ అధికారులు ఆక్రమణల కూల్చివేత చేపట్టారు. అయితే ఇవాళ కూల్చివేతల బాధితుల్లో చాలా మంది జహంగీర్ పురి ఘర్షణల్లో నిందితులుగా లేరని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+