వర్షాలు, వదరలే కాదు; నేడు వరుస భూకంపాలు; భయంతో జనం పరుగులు!!

ఒకపక్క దేశాన్ని వర్షాలు, వరదలు ముంచెత్తుతుంటే మరో పక్క రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జైపూర్ లో ఉదయం 4 గంటల 9 నిమిషాల నుండి, 4 గంటలు 25 నిమిషాల వరకు మూడు భారీ భూ ప్రకంపనలు సంభవించాయి.

వరుస భూకంపంతో రాజస్థాన్ వాసులు వణికి పోయారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలలో భూ ప్రకంపనలు రావడం స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. ఈ రోజు తెల్లవారుజామున సంభవించిన భూకంపం జైపూర్లోని రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.4 గా నమోదయింది. అక్కడ పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.

Not only rains, A series of 3 earthquakes today in jaipur and other areas!!

ఈ భూకంపానికి సంబంధించిన ప్రాణనష్టం కానీ ఆస్తినష్టం కానీ జరగలేదని సమాచారం. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే వరుసగా మూడు భూకంపాలు సంభవించడం రాజస్థాన్ వాసులను ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ఏదైనా ఆస్తినష్టం జరిగిందేమో అంచనా వెయ్యాల్సి ఉంది. అయితే దీనిపై మరింత వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా భూకంపాల నేపథ్యంలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ట్విట్టర్ వేదికగా స్పందించారు. జైపూర్ తో పాటు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో సైతం భూకంపం సంభవించినట్టు వసుంధర రాజే పేర్కొన్నారు. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను అంటూ వసుంధర రాజె ట్వీట్ చేశారు.

తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి కనిపించడంతో స్థానికులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బయటకు పరుగులు తీశారు. ఇక ఈ క్రమంలో భూకంపం వచ్చిన ప్రాంతాలలోని ప్రజలకు వారి సన్నిహితులు, బంధువులు ఫోన్ చేసి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.

కాగా గురువారం తెల్లవారుజామున కూడా మిజోరం లోని ఎన్ గోపాకు తూర్పున 61 కిలోమీటర్ల దూరంలో 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం 80 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+